Lifestyle: ఉదయాన్నే ఛాయ్‌, బిస్కెట్‌ తీసుకుంటున్నారా.? హెచ్చరిస్తున్న నిపుణులు

ఉదయాన్నే లేవగానే ఛాయ్‌, బిస్కెట్‌ తీసుకోవడం మనలో చాలా మందికి అలవాటు ఉండే ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రెండింటిన తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు..

Lifestyle: ఉదయాన్నే ఛాయ్‌, బిస్కెట్‌ తీసుకుంటున్నారా.? హెచ్చరిస్తున్న నిపుణులు
Lifestyle
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 08, 2024 | 4:22 PM

ఉదయం లేవగానే టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కేవలం టీ మాత్రమే కాకుండా అందులో బిస్కెట్స్‌ను ముంచుకు తినే వారు కూడా ఎక్కువే. గజిబిజీ జీవితంలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌కు బదులుగా దీనినే తీసుకుంటున్నారు. అయితే పరగడుపు ఛాయ్‌, బిస్కెట్‌ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

టీలో కెఫిన్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే బిస్కెట్‌లో చక్కెరతో పాటు కెఫిన్‌ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బిస్కెట్లలో ప్రాసెస్ చేసిన చక్కెరతో పాటు గోధుమ పిండి అధికంగా ఉంటుంది. ఇందులో సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

బిస్కెట్స్‌లో ఉండే పదార్థాలు వేగంగా బరువు పెరగడానికి కామత్రమే కాకుండా పొట్ట ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడపుతో తీసుకుంటే.. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు. దీనివల్ల అజీర్ణం, కడపులో ఇబ్బందిగా ఉండడం వంటి సమస్యలు వేధిస్తుంటాయని నిపుణులు అంటున్నారు.

మరీ ముఖ్యంగా ఉప్ప కంటెంట్‌ ఎక్కువగా ఉండే బిస్కెట్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే అధిక రక్తపోటుకు దారి తీస్తుందని అంటున్నారు. రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే బిస్కెట్స్‌లో ఉండే సుక్రలోజ్, అస్పర్టమే జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే టీతో పాటు బిస్కెట్స్‌ను తీసుకోకూడదని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..