Rohini Nilekani: విరాళంలో ఆమెదే పైచేయి.. కోట్లల్లోనే సాయం
దేశంలో సంపన్నులు క్రమంగా పెరుగుతున్నారు. రాజకీయ సుస్థిరత, పెరుగుతున్న ప్రజల ఆదాయాలు, వ్యాపారాల ప్రగతి తదితర అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. ఇది అందరూ ఆహ్వానించదగిన పరిణామం. అలాగే సంపన్నులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశంలో పేదల స్థితిగతులను మార్చడానికి విరివిరిగా విరాళాలు అందజేస్తున్నారు. సమాజంలో పేదలకు సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు తదితర వాటికి కోట్ల రూపాయలను అందజేస్తున్నారు.
విరాళాలు అందించిన వారిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని భార్య రోహిణి పేరు ప్రముఖంగా వినిపించింది. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాత్రోఫీ జాబితా 2024లో ఆమె అత్యంత ఉదార మహిళనే బిరుదు సంపాదించారు. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాత్రోఫీ జాబితా 2024 ప్రకారం రోహిణి నిలేకని రూ.154 కోట్ల విరాళం అందించారు. అలాగే ఈ దంపతులిద్దరూ ఈ ఏడాది వివిధ స్వచ్ఛంద సంస్థలకు రూ.450 కోట్లు అందజేశారు. ఈ జంట 2017లో గివింగ్ ఫ్లెడ్జ్ పై సంతకం చేశారు. తమ సంపదలో కనీసం సగమైనా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఫిలాంత్రోపీ సంస్థకు రోహిణి నిలేకని చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. దేశంలో వెనుక బడిన కమ్యూనిటీలకు అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే ఏక్ స్టెప్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. వెనుక బడిన వర్గాల ఉన్నతి, విద్యా వసతులను మెరుగపర్చడం, దేశంలో స్థిరమైన మార్పును తీసుకురావడమే ఈమె దానాల వెనుక ప్రముఖ లక్ష్యాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత ఉదారమైన పరోపకారి జాబితాలో రోహిణి పదో స్థానంలో నిలిచారు. గివింగ్ ప్లెడ్జ్ ను 2017లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని పరోపకారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి వీరందరూ పనిచేస్తున్నారు.
రోహిణి, నందన్ నిలేకని దంపతులు దానం చేయడాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. విద్య, సామాజిక అభివృద్ధి కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. రోహిణి వయసు 65 ఏళ్లు, ఆమె భర్త నందన్ నిలేకనికి 69 ఏళ్లు. వీరిద్దరూ దేశంలోని దాతల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. 2024లో వీరు రూ.307 కోట్ల విరాళం అందించారు. ఇది మునుపటి సంవత్సరం విరాళాల కంటే 62 శాతం ఎక్కువ. దేశంలోనే అనేక మంది బిలియనీర్లు కూడా పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి ప్రగతి కోసం కోట్లాది రూపాయలను దానం చేస్తున్నారు. తాము సంపాదించిన డబ్బులను సమాజ ప్రగతి కోసం వినియోగిస్తున్నారు. మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. టాటా గ్రూప్ కు చెందిన దివంగత చైర్మన్ రతన్ టాాటా అందించిన సేవలకు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..