దేశంలో 3500 ఏటీఎంలు మూసివేత.. కారణం ఏంటో తెలుసా..?

07 November 2024

Subhash

దేశంలో ఏటీఎంల సంఖ్య భారీగా తగ్గింది. గతేడాది సెప్టెంబర్‌ వరకు ఉన్న డేటాను ఈ ఏడాది సెప్టెండ్‌ నాటి డేటాతో పోలిస్తే దేశంలో 3,500 ఏటీఎంలు తగ్గాయి.

తగ్గిన ఏటీఎంలు

సెప్టెంబర్‌ 2024 నాటికి దేశంలో ఏటీఎంల సంఖ్య 2,15,767కి తగ్గింది. ఆర్బీఐ ప్రకారం సెప్టెంబర్‌ 2023లో ఏటీఎంల సంఖ్య2,19,281.

సెప్టెంబర్‌ 2024 నాటికి

ఏటీఎంల సంఖ్య తగ్గడానికి ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడమే ప్రధాన కారణమట. ఇప్పుడు QR కోడ్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీంతో నగదు తగ్గిపోయింది.

ఆన్‌లైన్‌

ఆఫ్‌-సైట్‌ ఏటీఎంలు మాల్స్‌, ఇతర ప్రదేశాలలో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి సంఖ్య కూడా తగ్గిందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.

ఆఫ్‌ సైట్‌ ఏటీఎం

ఏటీఎం ఏర్పాటు చేయాలంటే ఖర్చు కూడా భారీగా ఉంటుంది. అద్దె, సెక్యూరిటీ, నగదు నింపడం వంటి ఖర్చులు కూడా ఉండటంతో బ్యాంకులకు నష్టం కలుగుతోంది.

ఏటీఎంల ఖర్చు

UPI రాకతో ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగాయి. ఇప్పుడు ప్రజలు ఎక్కువగా డిజిటల్‌ చెల్లింపులకు ఇష్టపడుతున్నారు. దీంతో ఏటీఎం అవసరం మరింత తగ్గిపోతుంది.

UPI ఎఫెక్ట్‌

ఆర్బీఐ ప్రకారం 2019-20లో రూ.3,40,026 లక్షల కోట్లు విలువైన ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగాయి. ఇది 2023-24లో రూ.16,44,302 లక్షల కోట్లకు పెరిగింది.

ఆర్బీఐ గణాంకాలు

ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడం వల్ల భవిష్యత్తులో డిజిటల్‌ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకులు ఇప్పుడు ఏటీఎంలను తగ్గిస్తున్నాయి.

డిజిటల్‌ చెల్లింపులు