చపాతీలు మెత్తగా, మృదువుగా చేయడం ఒక కళ. చాలామందికి చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల అవి గట్టిగా వస్తాయి. ఇలా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు
TV9 Telugu
చపాతీ మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. నిజానికి చపాతీ ఎంత మెత్తగా మారుతుంది అనేది మీరు ఎంతసేపు పిండిని కలుపుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది
TV9 Telugu
నాణ్యమైన చపాతీ పిండి తీసుకోవాలి. అవసరమైతే దాన్ని జల్లెడ పట్టాలి. తగినంత పిండిని తీసుకుని కొద్దిగా నూనె, ఉప్పు, నీళ్లు చేర్చి కలుపుకోవాలి. ఉదాహరణకు మూడుకప్పుల పిండికి రెండు చెంచాల నూనె, చిటికెడు ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు సరిపోతాయి
TV9 Telugu
కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకొంటే చపాతీ పిండి చక్కగా కలుస్తుంది. దీనిపై తడి క్లాత్ కప్పి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల పిండి మెత్తగా, మృదువుగా మారుతుంది
TV9 Telugu
పిండిని కలిపేటప్పుడు చల్లనీరు కాకుండా కాస్త గోరువెచ్చని నీటితో కలపాలి. అదికూడా అన్ని నీళ్లు ఒకేసారి పోయకుండా నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. బాగా మెత్తగా పిండిని కలపాలి
TV9 Telugu
చపాతీ మృదువుగా రావాలంటే అందులో చిటికెడు బేకింగ్ సోడా కూడా కలపాలి. పిండిలో నెయ్యి కలిపినా చపాతీ మెత్తగా అవుతుంది. పిండిని పిసికిన తర్వాత గంటసేపు పక్కన పెట్టుకోవాలి
TV9 Telugu
ఇప్పుడు పిండిని మరోసారి కలుపుకొని సమాన ఉండలుగా చేసుకొని.. చపాతీలు వత్తుకోవాలి. చపాతీలు చేసుకునేటప్పుడు పొడి పిండిని ఎంత వీలైతే అంత తక్కువగా ఉపయోగించాలి. ఫలితంగా చపాతీలు మెత్తగా, మృదువుగా వస్తాయి
TV9 Telugu
వీటిని మొదట పచ్చిదనం పోయేంత వరకు తక్కువ మంటపై కాల్చుకోవాలి. ఆపై మంట మధ్యస్థంగా పెట్టి కాల్చుకుంటే అవి మాడిపోకుండా మెత్తగా వస్తాయి