- Telugu News Photo Gallery Australia proposes 'world leading' ban on social media for children under 16 Years
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం..! త్వరలోనే పార్లమెంటులో బిల్లు
ఈ మధ్య కాలంలో అధిక మంది యువత, పిల్లలు సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. ముక్కూ,ముఖం తెలియని వారిని నమ్మి వారి వలలో చిక్కుకుంటున్నారు. పైగా దీని అధిక వినియోగం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధించాలనీ..
Updated on: Nov 08, 2024 | 1:57 PM

ఈ మధ్య కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ దీని గురించి మాట్లాడుతూ.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేలా చట్టం చేశామన్నారు. ఈ నేపథ్యంలో వయస్సు వెరిఫికేషన్ విధానం త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపానే. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

సోషల్ మీడియా పిల్లలకు తీవ్ర హాని చేస్తోంది. దీని అధిక వినియోగం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా మోసాల వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచేందుకు ఈ ఏడాది ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రజాప్రతినిధుల ఆమోదం తెలిపిన 12 నెలల తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యాక్సెస్‌ను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ బాధ్యత తల్లిదండ్రులపైనా, యువతపైనా కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఆ దేశంలో 16 యేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై పూర్తి నిషేధం అమలులోకి వస్తుంది.

గత ఏడాది, 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ ప్రతిపాదించింది. కానీ వినియోగదారులు, తల్లిదండ్రుల వ్యతిరేకత వల్ల ఈ నిషేధాన్ని అమలు చేయలేదు. అయితే యునైటెడ్ స్టేట్స్‌లో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని పొందడం తప్పనిసరి.




