Lifestyle: తరచూ చేతులు వణుకుతున్నాయా.? ఈ సమస్యతో బాధపడుతున్నట్లే..
చేతులు వణకడం సర్వసాధారణమైన విషయం. మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్య ఎదురయ్యే ఉంటుంది. అయితే వయసు మళ్లిన తర్వాత ఈ సమస్య కనిపించడం కామనే అయినా చిన్నతనంలో కూడా చేతులు వణుకుతుంటే మాత్రం జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంతకీ చేతులు వణకడానికి అసలు కారణం ఏంటి.? ఇది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* చేతులతో పాటు.. తల, గొంతు వణకడాన్ని ఎసెన్షియల్ ట్రెమర్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా ఈ సమస్య వయసు మళ్లిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జన్యుపరమైన సమస్యగా చెబుతుంటారు. అయితే కుటుబంలో అంతకుముందు ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
* పార్కిన్సన్స్ వల్ల కూడా చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో శరీర కదలికలపై నియంత్రణ తగ్గుతుంది. దీనికి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. సరైన చికిత్సతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
* చేతులు వణకడానికి హైపర్ థైరాయిడిజం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. చేతుల్లో వణుకు, వేగవంతమైన హృదయ స్పందన, ఉన్నట్లుండి బరువు తగ్గడం వంటివి హైపర్ థైరాయిడిజం లక్షణాలుగా చెప్పొచ్చు.
* కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా చేతులు వణుకుతాయని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఒత్తిడితో ఉన్న సమయంలో శరీరంలోని నరాలు, కండరాలపై ప్రభావం పడుతుంది. దీంతో చేతుల్లో వణుకు మొదలవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగా, ధ్యానం వంటి అలవాట్లను చేసుకోవాలి.
* ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారితోపాటు, డ్రగ్స్ అలవాటు ఉన్న వారిలో కూడా చేతులు వణకడం సాధారణంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి నరాలతో పాటు కండరాలను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగానే చేతులు వణుకుతాయి. మద్యం అలవాటు ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తే వెంటనే మద్యం తీసుకోవడం ఆపేయాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..