Heart: గుండె ఆరోగ్యంగా ఉండాలా.? రోజూ ఈ పని చేయండి చాలు, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

గుండెపోటు బారినపడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైన వాటిలో శారీరక శ్రమ తగ్గడం ఒకటి. ప్రస్తుతం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. వాహనాలు అందుబాటులోకి రావడంతో చివరికి నడక కూడా తగ్గిపోయింది. ప్రతీ చిన్న పనికి వాహనం తీసే రోజులు వచ్చేశాయ్. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా శారీరకంగా...

Heart: గుండె ఆరోగ్యంగా ఉండాలా.? రోజూ ఈ పని చేయండి చాలు, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
Heart
Follow us

|

Updated on: Jul 15, 2024 | 5:36 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలోనే కనిపించే ఈ సమస్య ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలో కూడా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది.

గుండెపోటు బారినపడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైన వాటిలో శారీరక శ్రమ తగ్గడం ఒకటి. ప్రస్తుతం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. వాహనాలు అందుబాటులోకి రావడంతో చివరికి నడక కూడా తగ్గిపోయింది. ప్రతీ చిన్న పనికి వాహనం తీసే రోజులు వచ్చేశాయ్. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలని సూచిస్తున్నారు. లిఫ్ట్‌ వినియోగాన్ని తగ్గించి మెట్లను ఉపయోగాన్ని పెంచాలని సూచిస్తున్నారు.

మెట్లు ఎక్కడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు నిర్వహించి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. మెట్లను ఎక్కడం వల్ల కండరాలు బలోపేతం కావడడమే కాకుండా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తులనే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతిరోజూ 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఈ అధ్యయనంలో తేలింది.

లిఫ్ట్‌కి బదులుగా మెట్లు ఉపయోగించే వారిని ఇతరులతో పోల్చితో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నారు. క్రమంతప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో హై డెన్సిటీ లైపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) స్థాయి పెరుగుతుంది. దీనిని మంచి కొలెస్ట్రాల్‌గా పిలుస్తుంటారు. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీంతో ఇది గుండెపోటు అవకాశాలను తగ్గించడంలో ఉపయోపడుతుంది. ఇక మెట్లు ఎక్కడం వల్ల కేవలం గుండె సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా.. ఊబకాయం సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లు బలంగా మారడంతో పాటు, ఎముకలు కూడా ధృడంగా మారుతాయి.

అయితే కేవలం మెట్లను ఎక్కడం వల్ల మాత్రమే గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. గుండె ఆరోగ్యం ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సరిపడ నిద్ర ఉండడం కూడా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ధూమపానం, మద్యపానం తీసుకోవడాన్ని పూర్తిగా మానేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యలు సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
10 మంది మొబైల్ యూజర్లలో 9 మందికి కాల్ డ్రాప్ సమస్య..కీలక నివేదిక
10 మంది మొబైల్ యూజర్లలో 9 మందికి కాల్ డ్రాప్ సమస్య..కీలక నివేదిక