హార్ట్ ఎటాక్: మూడు మెయిన్ రీజన్స్!

నిత్యం అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా..? హైబీపీ కూడా ఉందా..? అయితే జాగ్రత్త.. మీకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు తాజాగా చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడుతున్న 36వేల మందిపై అధ్యయనం చేసిన ఆ సైంటిస్టులు పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. యుక్త వయస్సులో ఒత్తిడి, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో […]

హార్ట్ ఎటాక్: మూడు మెయిన్ రీజన్స్!
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2019 | 9:17 PM

నిత్యం అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా..? హైబీపీ కూడా ఉందా..? అయితే జాగ్రత్త.. మీకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు తాజాగా చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

గుండె జబ్బులతో బాధపడుతున్న 36వేల మందిపై అధ్యయనం చేసిన ఆ సైంటిస్టులు పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. యుక్త వయస్సులో ఒత్తిడి, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వాటిని ఆ వయస్సులో నియంత్రించలేకపోతే భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు వచ్చేందుకు 64 శాతం వరకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని తేల్చారు. అలాగే కేవలం హైబీపీ ఎక్కువగా ఉండే వారికి దాన్ని నియంత్రించలేకపోతే.. భవిష్యత్తులో వారి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరికైనా సరే.. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. వారు తమ జీవన విధానాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవడంతోపాటు నిత్యం వారు వ్యాయామం చేయాలని కూడా సైంటిస్టులు సూచిస్తున్నారు. దీంతో గుండె జబ్బులు రాకుండా ఆపవచ్చని వారు అంటున్నారు..!