Lifestyle: ఇది తెలిస్తే ఇకపై.. బాదం పొట్టును పడేయ్యరు..

ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బాదం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు కచ్చితంగా బాదంను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా కరోనా తర్వాత బాదంను ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి...

Lifestyle: ఇది తెలిస్తే ఇకపై.. బాదం పొట్టును పడేయ్యరు..
Almond Peel
Follow us

|

Updated on: Oct 17, 2024 | 1:36 PM

ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బాదం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు కచ్చితంగా బాదంను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా కరోనా తర్వాత బాదంను ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రోజూ బాదంను తీసుకోవడం వల్ల గుండె, మధుమేహం, బలహీనత, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే మనలో కొందరు బాదం పొట్టును తీసేసి తింటుంటారు. ముఖ్యంగా రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని బాదంను తీసుకునే వారు ఇలా పొట్టును తీసే పడేస్తుంటారు. అయితే బాదం పొట్టులో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బాదం పొట్టును తినడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెఉలసుకుందాం..

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో బాదం పొట్టు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని ఫైబర్, ఫ్లేవనాయిడ్లు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో ఉపయోగపడతాయి. ఇవి కడుపును శుభ్రం చేస్తాయి. దీంతో అజీర్తి, గ్యాంస్‌ వంటి సమస్యలు అస్సలు దరి చేరవు. బాదం పొట్టును ఎండబెట్టి పొడిగా చేసుకొని పాలలో కలుపుకొని తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

ఇక బాదం పొట్టులో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒకవేళ మీకు బాదం పొట్టు తినడం ఇష్టం లేకపోయినా.. బాదం పొట్టును.. గుడ్లు, కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌ వంటి వాటితో కలిపి హెయిర్‌ మాస్క్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జుట్టు బలంగా మారడంతో పాఉ, నిగనిగ మెరుస్తుంది.

బాదం పొట్టుతో చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను రక్షించి చర్మం ఎక్కువ కాలంపాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందుకోసం బాదం పొట్టును ఎండలో ఆరబెట్టి.. అందులో 1/4 కప్పు రోల్డ్ ఓట్స్, 1/4 కప్పు శెనగపిండి, 1/2 కప్పు కాఫీతో గ్రైండ్ చేసి, పెరుగుతో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ప్రతీరోజూ ముఖాన్ని అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..