ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే.. 50 శాతం ప్రసవాల్లో ట్విన్సే పుడతారు
నైజీరియాలోని ఇగ్బా ఓరా అనే ఊళ్లో ఎక్కడ చూసినా.. ఒకటే రకం దుస్తులను ఇద్దరిద్దరు వేసుకొని కనిపిస్తారు. ఎందుకంటే వారు కవలలు..! ఆ వూరి పేరు ఇగ్బో-ఓరా. ఇక్కడ ఏటా నిర్వహించే వరల్డ్ ట్విన్ ఫెస్టివల్ మొదలైంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు సాధించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని.. ఓయో స్టేట్ గవర్నర్ సేయి మకిండే చెప్పారు.
ఈ ఊళ్లో అత్యధిక మంది కవలలే. చాలా తక్కువగా ఒక్కరు జన్మిస్తారని చెబుతుంటారు. కవలల్లో కూడా ముందు పుట్టిన వారికి ‘తైవో’ అని పేరు పెడతారు. దీని అర్థం.. ‘ముందుగా ప్రపంచాన్ని అనుభూతి చెందిన’ అని వస్తుంది. అదే తర్వాత పుడితే కెహిండే అనే పేరు పెడతారు. ‘తర్వాత వచ్చిన వారు’ అని దీని భావం. ఇక్కడి ప్రజలు ఆహారంలో బెండ ఆకుతో చేసిన ఒక రకమైన సూప్‌ను, కందగడ్డ దుంపతో చేసిన పిండిని వాడుతుంటారు. కానీ, వీరి ఆహారానికి కవలలు జన్మించడానికి ఏ సంబంధం లేదని నిపుణులు చెబుతానారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
సిద్ధిఖి కుమారుడిని కూడా చంపేయండని.. షూటర్లకు బిష్ణోయ్ గ్యాంగ్ కాంట్రాక్ట్
పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా ?? నిపుణులు ఏం చెప్పారంటే ??
వైరల్ వీడియోలు
Latest Videos