ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ PAN కార్డ్‌ని ఒకసారి తయారు చేసిన తర్వాత, పాన్ కార్డ్ మీ జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.
మీ పాన్ కార్డ్ పోయినా లేదా పాడైపోయినా, మీరు సులభంగా డూప్లికేట్ పాన్ కార్డ్‌ని తయారు చేసుకోవచ్చు. NSDL మీకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధం.
ఇలా ఉంటె జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీరు రెండు పాన్ కార్డులను కలిగి ఉంటే ఒక పాన్ కార్డును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సరెండర్ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో సరెండర్ చేయడానికి, మీరు NSDL వెబ్‌సైట్‌కి వెళ్లి, NSDL (నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్0 ఇచ్చిన సూచనలను అనుసరించాలి.
పాన్ కార్డ్ సరెండర్ కోసం, మీకు ఫోటో, సంతకం, గుర్తింపు కార్డు వంటి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం ఉంటుంది.
ఆన్‌లైన్ సరెండర్ కోసం మీరు తక్కువ రుసుము చెల్లించాలి. మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు తర్వాత మీరు రసీదు పొందుతారు.
ఈ రసీదును భద్రంగా ఉంచండి. ఎందుకంటే ఆన్‌లైన్ సరెండర్ తర్వాత, రెండు ఫోటోగ్రాఫ్‌లను రసీదు కాపీతో పాటు NSDL కార్యాలయానికి పంపాలి.