పోషకాల మొలకలు... వీరు అస్సలు అస్సలు ముట్టుకోకూడదు!
16 October 2024
TV9 Telugu
TV9 Telugu
పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని భర్తీ చేస్తాయి. ఇందులో ప్రోటీన్, డైటరీ ఫైబర్, పిండి పదార్థాలు, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
పెసర పప్పును అనేక విధాలుగా ఆహారంలో తీసుకోవచ్చు. కొంతమంది పప్పు చేసి తింటారు. మరికొందరు దానితో కిచిడీ చేసుకుని తినేందుకు ఇష్టపడతారు. అయితే, వీటిలోని పోషకాలు సమృద్ధిగా పొందాలంటే మొలకలు తినడం మంచిది
TV9 Telugu
మొలకలు తింటే మంచిదని మనకు తెలుసు. కానీ వాటిని నానబెట్టి, మళ్లీ ఆ నీళ్లని వడకట్టి.. మొలకలు రావడానికని ఓ వస్త్రంలో చుట్టి పెడుతుంటాం. చాలామంది ఇవన్నీ చేయడానికి బద్ధకించి ఊరుకుంటారు
TV9 Telugu
శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. పోషకాలు పుష్కలంగా అందాలన్నా, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలన్నా.. రోజూ కాసిన్ని మొలకలు తినాలంటారు నిపుణులు
TV9 Telugu
అయితే కొందరు మాత్రం ఈ మొలకలు తింటే తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. జైపూర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మేధావి గౌతమ్ మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యలు, యూరిక్ యాసిడ్ పెరిగిన వారు మొలకలను తినకూడదు
TV9 Telugu
వీటిల్లో ప్యూరిన్లు లేదా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ పేషెంట్లు మొలకలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి
TV9 Telugu
కిడ్నీ రోగులు అంటే కెరాటిన్ స్థాయిలు పెరిగిన వారు వీటికి దూరంగా ఉండాలి. ఇటువంటి రోగులు ఆరోగ్యం కదాని మొలకలను తింటే, అవి ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తాయి
TV9 Telugu
కిడ్నీల్లో రాళ్లకు ప్రధాన కారణం అధిక ప్రోటీన్ లేదా నీటి లోపం. ఇటువంటి వారు ప్రోటీన్ తీసుకోవడం తగ్గించడం చాలా అవసరం. కాబట్టి ఇటువంటి వారు నిపుణుల సలహా మేరకే మొలకలు తీసుకోవాలి