మడ అడవుల వల్ల ఉపయోగం ఇదే..!

TV9 Telugu

15 October 2024

మసాలా లేనిదే భారతీయ వంటకాలు అస్సలు పూర్తి చేయలేము. ఇది ఉంటేనే చాలామంది భారతీయులు ఆహారం తినడానికి ఇష్టపడతారు.

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల మసాలా దినుసులు బూజు పట్టి లేదా పురుగులు పట్టి పాడైపోతుంటాయి.

మసాలా పొడులు గడ్డ కడుతుంటాయి. ఈ సీజన్​లో మసాలా దినుసులను తేమ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో అస్సలు పెట్టొద్దు.

మార్కెట్లో కొని ఇంటికి తెచ్చుకున్న మసాలా దినుసులను ఎండలో ఎండబెట్టి ఎయిర్​టైట్​ కంటెయినర్లో స్టోర్​ చేయండి.

ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి.. వంటి వాటిని ఎక్కువ మొత్తంలో పొడి చేసుకుని నిల్వ ఉంచుకోకూడదు.

అవసరమైనప్పుడు మిక్సీ పట్టుకుంటే కూర రుచి పెరుగుతుంది. ప్లాస్టిక్‌ కవర్లలో, స్టీలు సీసాల్లో ఉంచకుండా గాజు సీసాల్లో నిల్వ చేయాలి.

మసాలా దినుసులను పాన్‌ లేదా అవెన్‌లో వేసి కాసేపు వేడి చేయాలి. తర్వాత వీటిని భద్రపరిస్తే ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి.

పసుపు, కారం, ధనియాల పొడిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి సహజ పరిమళాలు పోయి పొడి కాస్త గడ్డలా మారిపోతుంది. గాజు సీసాలో స్టోర్​ చేసుకోండి.