AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు..

ఒత్తిడితో కూడుకున్న జీవితం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, తక్కువ నీరు తాగడం కారణం ఏదైనా ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే అనుభవించే ఆ నరకం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్‌ కూడా చేసే పరిస్థితి వస్తుంది. అయతే కిడ్నీల్లో రాళ్ల సమస్యను శరీరం కొన్ని లక్షణాల....

Health: శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు..
Kidney Stones
Narender Vaitla
|

Updated on: Mar 29, 2024 | 12:02 PM

Share

ఒత్తిడితో కూడుకున్న జీవితం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, తక్కువ నీరు తాగడం కారణం ఏదైనా ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే అనుభవించే ఆ నరకం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్‌ కూడా చేసే పరిస్థితి వస్తుంది. అయతే కిడ్నీల్లో రాళ్ల సమస్యను శరీరం కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే తెలియజేస్తుంది. ఇంతకీ కిడ్నీల్లో రాళ్లు వస్తే కనిపించే ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పే మొదటి లక్షణం పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. పక్కటెముకలు, భుజాలు, వీపులో దిగువ భాగంలో నొప్పి వస్తే అది కిడ్నీ స్టోన్‌ కావొచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించినప్పుడు, నొప్పి పొత్తికడుపుతో పాటు లోయర్‌ బ్యాక్‌కు వ్యాపిస్తుంది.

* మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన నొప్పి లేదా మంటను అనుభవిస్తే ఇది కూడా మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతం కావచ్చు. ఈ లక్షణం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* సాధారణం కంటే తరచుగా మూత్ర విసర్జన చేస్తే మూత్ర నాళంలోకి రాయి చేరిందని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

* కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కనిపించే మరో సాధారణ లక్షణం మూత్రంలో రక్తం ఒకటి. దీనిని హెమటూరియా అని కూడా అంటారు. రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో వస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లేనని అర్థం.

* మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన దుర్వాసన వచ్చినా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించినా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కడుపు నొప్పితో పాటు పైన తెలిపిన లక్షణాలు ఉంటే వెంటనే కిడ్నీ సంబంధిత పరీక్ష చేయించుకోవాలని చెబుతున్నారు.

* జ్వరం, చలి కూడా కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు. దీర్ఘకాలంగా జ్వరం వస్తూ పోతుంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి