AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఈ లక్షణాలున్నాయా.? ఉప్పు తక్కువగా తింటున్నట్లే..

ప్రస్తుతం అయోడిన్ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉప్పు తక్కువగా తీసుకోవడమే కాకుండా ఇతర సమస్యల కారణంగా అయోడిన్ లోపం ఏర్పడుతుంది. అయోడిన్ లోపాన్ని ఎలా గుర్తించాలి.? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: ఈ లక్షణాలున్నాయా.? ఉప్పు తక్కువగా తింటున్నట్లే..
Health
Narender Vaitla
|

Updated on: Oct 22, 2024 | 10:53 AM

Share

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య ఇబ్బందులు తప్పవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు ఎక్కువైతే బీపీ మొదలు గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు ఎలా ఉంటాయో.. తక్కువగా తీసుకున్నా కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు తక్కువగా తీసుకుంటే వచ్చే ప్రధాన సమస్యల్లో అయోడిన్‌ లోపం ఒకటి. అయితే అయోడిన్‌ లోపాన్ని శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ఆధారంగా గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువ స్థాయిలో ఉందని గణంకాలు చెబుతున్నాయి. శరీరంలో అయోడిన్‌ లోపం ఉంటే నిత్యం అలసట, బలహీనత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి పని చేయకపోయినా అలసిపోతుంటారు. అలాగే ఏ కారణం లేకపోయినా బరువు పెరుగుతారు. అయోడిన్‌ లోపం ఉన్న వారిలో జట్టు రాలడం, చర్మం పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక అయోడిన్‌ లోపంలో కనిపించే మరో ప్రధాన లక్షణం ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పెరుగుదల తగ్గుతుంది. చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

అయోడిన్‌ లోపం ఎక్కువగా గర్భినీలు, పాలిచ్చే తల్లులతో పాటు చిన్నారుల్లో కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే అయోడిన్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా. సముద్రపు చేపలు, రొయ్యలు, గుడ్లు, పాలు, చీజ్, పెరుగు, చికెన్ వంటి వాటి ద్వారా కూడా శరీరానికి అయోడిన్‌ లభిస్తుంది. ప్రతీ రోజూ ఫుడ్‌లో ఇవి ఉండేలా చూసుకోవాలి. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేసుకోవడం ద్వారా అయోడిన్ లోపం ఉందో లేదో తెలుసుకుంటూ.. వైద్యుల సూచనలు పాటించాలి.

అయోడిన్‌ స్థాయిలను గుర్తించేందుకు పలు రకాల పరీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా రక్త పరీక్ష, థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేయడం వల్ల అయోడిన్‌ స్థాయిలను గుర్తించవచ్చు. థైరాయిడ్ పనితీరును అంచనా వేయొచ్చు. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇదే కేవలం మహిళలకే పరిమితం కాకుండా పురుషుల్లోనూ ఇబ్బందులకు గురి చేస్తుంది. అయోడిన్ లోపం వల్ల అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం అవుతుంది. దీని వల్ల గర్భధారణకు అవసరమైన స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..