Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్ టీకా వేసుకుంటే ఇవి ఉచితం..! ఎక్కడెక్కడ ఏం ఇస్తున్నారో తెలుసా..?

Covid-19 Vaccination : మూడో దశలో టీకా డ్రైవ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ చుట్టూ ఉన్న పుకార్లను తొలగించడానికి

కొవిడ్ టీకా వేసుకుంటే ఇవి ఉచితం..! ఎక్కడెక్కడ ఏం ఇస్తున్నారో తెలుసా..?
Covid 19 Vaccination
Follow us
uppula Raju

|

Updated on: May 11, 2021 | 11:23 AM

Covid-19 Vaccination : మూడో దశలో టీకా డ్రైవ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ చుట్టూ ఉన్న పుకార్లను తొలగించడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ చాలామంది టీకా వేసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం పుకార్లను తొలగించి పౌరులు టీకాలు వేసుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా ప్రజలు టీకాలు వేసుకునేలా రకరకాల ఉచితాలను అందిస్తున్నారు. ఉచిత బంగారు ముక్కు పిన్స్ నుంచి, బిల్లులపై తగ్గింపు వరకు ఉచితాలు అందిస్తున్నారు. వాటికి సంబంధించి కొన్ని ఇక్కడ ఉన్నాయి.

Tv9

Tv9

1. ఉచిత బీర్ గుర్గావ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ అనే పబ్.. టీకాలు వేసుకున్నవారికి ఉచిత బీరును అందిస్తోంది. ఉచిత బీరును స్వీకరించడానికి బదులుగా వారి టీకా వేసుకున్న కార్డును చూపించాల్సి ఉంది. ఒక వారం పాటు కొనసాగిన ఈ ఆఫర్ ఏప్రిల్ 5 న ప్రారంభమైంది. నగరవాసులు టీకాలు వేయించుకోవాలని ప్రోత్సహించింది.

2. ఉబెర్ ఉచిత ప్రయాణం దేశంలోని 19 నగరాల్లో టీకాలు వేసుకునే వృద్ధులకు ఉచిత రైడ్ అందిస్తామని ఉబెర్ ఇండియా గత నెలలో ప్రకటించింది . మొత్తం 25,000 ఉచిత రైడ్లను అందిస్తామని తెలిపింది. ఈ చర్య హెల్ప్ ఏజ్ ఇండియా అనే ఎన్జీఓతో భాగస్వామ్యంలో భాగమని ప్రకటించింది.

3. బంగారు ముక్కు పిన్స్ గుజరాత్‌లోని స్వర్ణకారుల సంఘం రాజ్‌కోట్‌లో టీకాలు వేసుకున్న పౌరులకు ఉచితాలను ప్రకటించింది. మహిళలకు బంగారు ముక్కు పిన్స్ పురుషులకు హ్యాండ్ బ్లెండర్లు ఇచ్చారు .

4. ఉచిత ఆహారం రాజ్‌కోట్ జిల్లా పౌరులు ఉచిత ఆహారాన్ని ప్రకటించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని జాన్ విజన్ అనే సంస్థ టీకాలు వేసుకున్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది. “మేము అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నాం. ప్రజలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాల్సిన అవసరం లేదని చెప్పారు”.

5. రెస్టారెంట్లలో డిస్కౌంట్ ఢిల్లీలోని పంజాబ్ గ్రిల్, యు మీ వంటి రెస్టారెంట్లు వ్యాక్సిన్ తీసుకున్నవారికి మొత్తం బిల్లులో 10-20% ప్రత్యేక తగ్గింపును ప్రకటించాయి.

భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు కొత్త కొత్త మార్గాల ద్వారా టీకాలు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు వర్జీనియాలోని ఫ్లాయిడ్‌లోని రెడ్ రూస్టర్ కాఫీ టీకా వేసుకున్నవారికి $ 250 బోనస్‌గా అందిస్తోంది. యువకులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ లో ఓ బార్ కూడా ఉచిత పానీయాలు అందిస్తోంది. కొన్ని దుబాయ్ రెస్టారెంట్లు వినియోగదారులకు 20-30% తగ్గింపును అందిస్తున్నాయి.

ఇండియాలో వ్యాక్సిన్ కొరతకు సవాలక్ష కారణాలు, తప్పెవరిది ? ప్రభుత్వానిదా ? ఉత్పత్తిదారులదా ?

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..! ఒకే బైక్ పై ఐదుగురు ప్రయాణం.