ఇండియాలో వ్యాక్సిన్ కొరతకు సవాలక్ష కారణాలు, తప్పెవరిది ? ప్రభుత్వానిదా ? ఉత్పత్తిదారులదా ?

ఇండియాలో గత ఏడాది దేశం నుంచి సుమారు 80 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా జరిగింది. కరోనా వైరస్ తో సతమతమవుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న దేశాలకు ఇండియా...

ఇండియాలో వ్యాక్సిన్ కొరతకు సవాలక్ష కారణాలు, తప్పెవరిది ? ప్రభుత్వానిదా ? ఉత్పత్తిదారులదా ?
Why India Is Facing Vaccine Shortage Analysis
Follow us
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Updated on: May 11, 2021 | 12:33 PM

ఇండియాలో గత ఏడాది దేశం నుంచి సుమారు 80 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా జరిగింది. కరోనా వైరస్ తో సతమతమవుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న దేశాలకు ఇండియా ఇక్కడి నుంచి కొన్ని కోట్ల డోసుల వ్యాక్సిన్ ని పంపింది. ఇందుకు అమెరికా, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ఇండియాకు కృతజ్ఞతలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకు కూడా ఇండియాను ప్రశంసించింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఈ దేశాలకు టీకా ముందు పంపి తన ఉదారతను చాటుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మార్చి తరువాత ఏప్రిల్ నుంచి దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలైన సీరం కంపెనీ, భారత్ బయో టెక్ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి నడుం బిగించాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పడు ముడిపదార్ధాల కొరత వీటిని ఎక్కువగా వేధిస్తోంది. దేశంలో జనాభాకు అనుగుణంగా టీకామందులు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.

ఇక ప్రధాన కారణం ఉత్పత్తిదారులతో ప్రభుత్వం అడ్వాన్స్ కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకోలేకపోవడం.. ఉత్పత్తి పెంచడానికి లిక్విడిటీ అనుమతి విషయంలో జాప్యం జరుగుతోంది, ఎగుమతులు, దేశీయ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని షాహిద్ జమీల్ వంటి నిపుణులు అంటున్నారు. గత డిసెంబరు 20 న సీరం కంపెనీ దేశీయ వినియోగానికి సంబంధించి డిస్కౌంట్ లో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్స్ ని ఇవ్వలేకపోయింది. ఇలా ఆలస్యం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగా అసలు గత మార్చి నాటికే 10 కోట్ల డోసుల టీకామందును ఉత్పత్తి చేయాలన్న తన లక్ష్జ్యాన్ని సీరం సంస్థ వాయిదా వేసుకుంది. హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ సంస్థది కూడా ఇంచుమించు ఇదే ప్రాబ్లమ్..35 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 65 కోట్ల డోసుల టీకామందును ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్లఉత్పత్తికి దోహద పడే ముడి పదార్థాల ఎగుమతిపై గల ఆంక్షలను అమెరికా తొలగించిన కారణంగా కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..! ఒకే బైక్ పై ఐదుగురు ప్రయాణం.

Viral Video :ఏలియన్స్ నన్ను కిడ్నప్ చేసాయి..!అంటూ లేడి షేర్ చేసిన వీడియో వైరల్..

Viral Video : టైర్ పై ఆ స్టాంట్స్ ఏంట్రా స్వామి …టాలెంట్ కు నెటిజెన్లు ఫిదా ! వైరల్ అవుతున్న వీడియో.