Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice water Benefits : బియ్యంనీరు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం..! ఎలాగో తెలుసుకోండి..

Rice water Benefits : వేసవి కాలంలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం కొద్దిగా కష్టం. ఈ సీజన్లో జుట్టు పొడిబారి ప్రాణములేనిదిగా

Rice water Benefits : బియ్యంనీరు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం..! ఎలాగో తెలుసుకోండి..
Rice Water Hair
Follow us
uppula Raju

|

Updated on: May 11, 2021 | 12:31 PM

Rice water Benefits : వేసవి కాలంలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం కొద్దిగా కష్టం. ఈ సీజన్లో జుట్టు పొడిబారి ప్రాణములేనిదిగా కనిపిస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అటువంటప్పుడు జుట్టు ఆరోగ్యం కోసం బియ్యం నీటిని ప్రయత్నించండి. మీ జుట్టు తిరిగి మునుపటిలా తయారవుతుంది. జుట్టు, చర్మ సంరక్షణకు బియ్యం నీరు చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. మాడ్ అని పిలవబడే వరి నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం అమైనో ఆమ్లాలు, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది.

బియ్యం నీరు ఎలా తయారు చేయాలి దీని కోసం బియ్యం ఉడికించేటప్పుడు కొంచెం ఎక్కువ నీరు కలపాలి. అప్పుడు అదనపు నీటిని తొలగించండి. ఈ నీటిని జుట్టు, చర్మం కోసం ఉపయోగించవచ్చు. బియ్యం నీరు దెబ్బతిన్న జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది కాకుండా మీరు చర్మ సంరక్షణకు కూడా వాడవచ్చు.

జుట్టును మృదువుగా ఉంచుతుంది.. బియ్యం నీరు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మీ జుట్టు పొడిగా, ప్రాణములేనిది అయితే బియ్యం నీటిని వాడండి. ఇది మీ జుట్టుకు నేచురల్ కండీషనర్ లాగా పనిచేస్తుంది. ఇందులో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు చాలా ఉన్నాయి. జుట్టును మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

జుట్టు మందంగా మరియు బలంగా చేయండి.. బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్లు, ఇనోసిటాల్ ఉంటాయి, ఇది జుట్టును బలోపేతం చేయడానికి దట్టంగా పెరగడానికి సహాయపడుతుంది. నెత్తిమీద 10 నుంచి 15 నిమిషాల పాటు తేలికపాటి చేతితో మసాజ్ చేయండి. తర్వాత నీటితో కడుక్కోండి. మీకు కావాలంటే మీ జుట్టుపై బియ్యం నీరు వేసి కొద్దిసేపు అలాగే ఉంచి అనంతరం షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని వారానికి రెండు మూడు రోజులు చేయండి. ఫలితాలు తొందరలోనే కనిపిస్తాయి.

ఢిల్లీ ఆసుపత్రి నుంచి పరార్, నచ్చిన హాస్పిటల్స్ లోకి జంప్, హస్తినలో కోవిడ్ 19 రోగుల ‘దాగుడు మూతలు’, అధికారుల పరేషాన్ !

Telangana lockdown: తెలంగాణలో లాక్‌డౌన్..? సీఎం కేసీఆర్ నిర్ణయం అదేనా.. మరికాసేపట్లో కేబినేట్ భేటీ