మీ గుండె ఆరోగ్యంగా ఉందా..? ఇంట్లో ఇలా చెక్ చేసుకోండి..! 90 సెకన్లలలో తెలుస్తుంది..
Heart Test : కరోనా మహమ్మారి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమైంది. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కరోనా పట్టి పీడిస్తుంది.

Heart Test : కరోనా మహమ్మారి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమైంది. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కరోనా పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. WHO నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం. అయితే మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇంట్లోనే పరీక్షలు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
గుండె జబ్బులు వృద్ధాప్యం వల్ల వచ్చే వ్యాధి అని చాలా మంది అంటారు.. అందుకే 50-60 ఏళ్ళకు ముందు అస్సలు రాదంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఏ వయసులోనైనా గుండె జబ్బులు సంభవిస్తాయి. ఇంట్లో ఈ సులువైన పరీక్ష ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం.. మెట్లు ఎక్కే పరీక్ష సహాయంతో ఇంట్లో కేవలం 90 సెకన్లలో మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. 2020 డిసెంబర్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. ఆరోగ్యకరమైన హృదయం ఉన్నవారు కేవలం 45 సెకన్లలో 60 మెట్లు ఎక్కవచ్చు. కొరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్న ఈ రకమైన 165 మంది రోగులను ఈ అధ్యయనంలో పరిశీలించారు.
60 మెట్లు ఎక్కడానికి మీరు 90 సెకన్ల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే మీ గుండె పూర్తిగా ఆరోగ్యంగా లేదని వైద్యుడిని సంప్రదించాలని తెలుస్తుంది. అలాంటి వారిలో మరణించే ప్రమాదం సంవత్సరానికి 2 నుంచి 4 శాతం వరకు ఉంటుంది. 60 మెట్లు ఎక్కడానికి 90 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకునే వారిలో 58 శాతం మందికి అసాధారణమైన గుండె పనితీరు ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన 2016 అధ్యయనం ప్రకారం 45 శాతం గుండెపోటు నిశ్శబ్దంగా వస్తుంది. దీని అర్థం లక్షణాలు ఉండవు. కనుక మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.