
అధిక బరువు కారణంగా పాదాలపై ఒత్తిడి అనేది బాగా పెరుగుతుంది. దానికి తోడు ఇంట్లో ఉండే మహిళలు నిరంతరం ఏదో ఒక పని చేస్తూ.. అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఈ కారణంగా కూడా పాదాలపై స్ట్రెస్ పెరిగి నొప్పులు వస్తాయి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ కూడా పాదాల నొప్పుల రావడం అనేది సాధారణమైన సమస్యలు. దీంతో చాలా మంది నడవడానికి ఇష్ట పడరు. అటూ ఇటూ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కాస్త నడిచిన తర్వాత బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్ని రకాల ఎక్సర్ సైజుల వల్ల ఈ పాదాలు, మడాల నొప్పులను తగ్గించు కోవచ్చు. కనీసం రోజుకు ఒకసారి అయినా ఈ వ్యాయామం చేస్తే ఉపశమనంగా ఉంటుంది. వీటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని కూడా లేదు. కూర్చున్న చోటు నుంచే వీటిని చేయవచ్చు. మరి ఆ వ్యాయామాలు ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుర్చీ లేదా సోఫాలో కూర్చుని పాదాలను నేలకు సమాంతరంగా ఆనించి కూర్చోండి. పాదాలు నేలకు తాకించి.. వేళ్లను మాత్రం పైకి లేపి ఉంచండి. ఐదు లేదా పది సెకన్లు అలా ఉంచి.. కిందికి దించండి. ఇలా రోజుకు పది సార్లు చేయాలి.
2. కుర్చీలో కుర్చుని ఒక కాలి మీద మరో కాలు వేసి కూర్చోండి. ఒక కాలి వేళ్లను చేతి అందే విధంగా పెట్టుకోండి. కాలి బొటన వేలుని ఒక చేతితో పట్టుకుని.. నాలుగు వైపులకు లాగాలి. ఆ తర్వాత రెండో కాలి బొటన వేలిని కూడా ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి రిలీఫ్ నెస్ ఉంటుంది.
3. కుర్చీ లేదా సోఫాలో నిదానంగా కూర్చోండి. కాలి కింద ఓ నేప్ కిన్ వేసు కోవాలి. కాలి వేలితో దాన్ని లోపలి వైపుకు లాగండి. ఇలా రోజుకు పది సార్లు చేస్తే నొప్పులు తగ్గుతాయి.
4. ప్రశాంతంగా కూర్చొని చపాతీ కర్రను పాదాల కింద పెట్టుకుని.. అటూ ఇటూ దొర్లించాలి. ఇలా చేస్తే పాదాల్లో రక్త ప్రసరణ అనేది బాగా జరిగి.. నొప్పులు లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి.
5. ఎప్పుడూ చొప్పులతోనే కాకుండా.. అప్పుడప్పుడు చొప్పులు లేకుండా కూడా నడవాలి. దీని వల్ల పాదాల్లో ఉండే నరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో కండరాలపై ఒత్తిడి పెరిగి.. బలంగా తయారవుతాయి. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఇసుకలో నడిస్తే ఇంకా మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.