Beauty Care: వయసును తగ్గించే ఈ ఆహారాలు తింటున్నారా? లేదంటే చర్మం ముడుతలు పడిపోతుంది..
యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సరిపడా నీళ్లు, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు పుష్కలంగా అందినప్పుడు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాలు లోపిస్తే చర్మానికి సంబంధించి అంతర్గత సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు..
యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సరిపడా నీళ్లు, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు పుష్కలంగా అందినప్పుడు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాలు లోపిస్తే చర్మానికి సంబంధించి అంతర్గత సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు శరీర చర్మం దెబ్బ తినడంలో లోషన్లు, క్రీములు, మాస్క్‌లు, సీరమ్‌లు.. వంటి సౌందర్య ఉత్పత్తులు కూడా కీలకపాత్ర పోషిస్తాయనే విషయం మర్చిపోకూడదు. వీటిలోని రసాయనాలు దీర్ఘకాలంపాటు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. ఐతే రకరకాల ట్రీట్‌మెంట్లు, సౌందర్య ఉత్పత్తులకు బదులుగా సహజంగా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంతోపాటు, చర్మానికి సహాజకాంతిని అందించే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ వివరాలు ఇవే..
బాదం ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బాదం పప్పు ఒకటి. వీటిల్లో ఉండే విటమిన్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పలుకులు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్ తీసుకోవచ్చు.
పిస్తా పిస్తాల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు చర్మంపై ముడుతలు రాకుండా నివారిస్తాయి.
జీడిపప్పు శరీరానికి కావాల్సిన మినరల్స్, అమైనో ఆమ్లాలు, ఫైబర్ జీడిపప్పులో పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు జీడిపప్పు తిన్నారంటే చర్మకాంతి ఇమనుమడిస్తుంది. జీడిపప్పుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. రుచికి కూడా బాగుంటుంది.
వాల్‌నట్స్ వాల్‌నట్స్‌లో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ, సీ,కే, బీ-1, బీ-2 పుష్కలంటా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపల్నుంచి పోషిస్తాయి.
ఖర్జూరం సత్వర శక్తిని అందించే వాటిల్లో ఖర్జూర పండ్లు ముఖ్యమైనది. ఇవి రోజూ తినటం వల్ల రక్తం ప్రసరణ పెరగడంతోపాటు, ఉత్సాహంగా ఉంటారు.
బొప్పాయి దీనిలో పాస్పరస్, బీ విటమిన్, పొటాషియంతోపాటు ఇతర పోషకాలు ఎన్నో ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మంపై ఏర్పడే గీతలు, ముడతలను నివారిస్తుంది.
వీటితోపాటు ఇతర డ్రైఫ్రూట్స్, పాలకూర, బ్రొకోలి, అవకాడో, స్వీట్ పొటాటో, దానిమ్మ గింజలు వంటి పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే నిత్య యవ్వనం మీ సొంతం.