Soft Skills: మీరెంత తెలివైన వారైనా.. ఈ సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే సక్సెస్ కాలేరు..
మీ తెలివితేటల్ని ఎక్కడికెళ్లినా పొగుడుతున్నారా.. మీ అంద స్మార్ట్ వ్యక్తులు లేరని ప్రశంసిస్తున్నారా.. మరి మీరెందుకు ఇంకా సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా?..అయితే ఇది నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. వీరు సక్సెస్ కాలేకపోవడానికి సాఫ్ట్ స్కిల్స్ ను విస్మరించడమే. ఇంతకీ అవేంటి.. వాటి వల్ల ఏం ప్రయోజనం వంటివి తెలుసుకుందాం...

సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇతరులతో సమర్థవంతంగా ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయాలి, భావోద్వేగాలను ఎలా నియంత్రించాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి అని తెలుసుకోవడం. కొందరు అన్నింట్లో ముందుంటారు. చిన్నప్పుడు చదువుల్లో పెద్దయ్యాక మార్కుల్లో.. ఇక ఆఫీసులో వీరిని మించిన వారుండరు. కానీ ఎంత ఉండి ఏం లాభం ఇవేవీ మీ జీవితాన్ని నిలబెట్టలేకపోతే, మిమ్మల్ని ఆర్థికంగా ఎదగనీయకపోతే ఎన్ని క్వాలిటీస్ ఉన్న వ్యర్థమే కదా. సామాజికంగా మానం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటుండాలి. ఇవి హార్డ్ స్కిల్స్ (సాంకేతిక నైపుణ్యాలు) కన్నా భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే హార్డ్ స్కిల్స్ సాధారణంగా ఉద్యోగానికి సంబంధించినవై ఉంటాయి. సాంకేతికమైన నాలెడ్జ్ వీటికి ముఖ్యం. కానీ, సాఫ్ట్ స్కిల్స్ మీ పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి, బలమైన వృత్తిపరమైన సంబంధాలను నిర్మించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
యజమానులు కోరుకునే 10 కీలక సాఫ్ట్ స్కిల్స్:
సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు: ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం, ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం. సమస్య పరిష్కార నైపుణ్యాలు: సవాళ్లను విశ్లేషించి, సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడం. డేటా విశ్లేషణ: నిర్ణయాలు తీసుకోవడానికి సంఖ్యలు మరియు సమాచారాన్ని ఉపయోగించడం. సమయ నిర్వహణ నైపుణ్యాలు: పనిని సమయానికి, సమర్థవంతంగా పూర్తి చేయడం. డిజిటల్ అక్షరాస్యత: సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం తాజా టూల్స్‌ను ఎఫీషియెంట్ గా ఉపయోగించడం. సృజనాత్మక ఆలోచన: వినూత్న ఆలోచనలను పరిష్కారాలను రూపొందించడం. మానసిక చురుకుదనం: మారుతున్న పరిస్థితులకు త్వరగా అనుగుణంగా ఉండడం. ఆత్మవిశ్వాసం: తన సామర్థ్యంపై నమ్మకం ఉంచడం సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం. భావోద్వేగ మేధస్సు : తన భావోద్వేగాలను నియంత్రించడం ఇతరుల భావనలను అర్థం చేసుకోవడం. స్వావలంబన: స్వతంత్రంగా పని చేయడం బాధ్యతలను చొరవతో నిర్వహించడం.
సాఫ్ట్ స్కిల్స్ మీకు సహజంగా వచ్చినా లేదా సమయంతో మెరుగుపరచుకున్నా, అవి మీ వృత్తిపరమైన జీవితంలో శాశ్వతమైన ముద్ర వేయడానికి ఒక గొప్ప మార్గం. ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా, మీరు మీ వ్యక్తిగత జీవితం బాధ్యతలకు అనుగుణంగా ఈ నైపుణ్యాలను మీ సొంత వేగంతో అభివృద్ధి చేసుకోవచ్చు.