Watermelon Tips: ఇలాంటి పుచ్చకాయ కనిపిస్తే.. ఎంత రేటైనా సరే వెంటనే కొనేయండి..
ఏ పండైనా బేరం ఆడి తీసుకోవచ్చు కానీ పుచ్చకాయలు కొనడం మాత్రం అంత తేలిక కాదు. ఎందుకంటే వీటిని కోస్తే తప్ప లోపల ఎలా ఉందో తెలియదు. అంత ధర పెట్టి కొన్నాక తీరా అది పండకుండా ఉండటమో లేక చెట్టు నుంచి తెంపి చాలా కాలామైందిగానో ఉంటే.. అందుకే ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే పుచ్చకాయ క్వాలిటీని చూడగానే కనిపెట్టేసే టిప్స్ ఇవి.. పుచ్చకాయ కొనేటప్పుడు, దాని మచ్చలు, ఆకారం, బరువు, గట్టిదనం వంటి చూసి అది లోపల ఎలా ఉందో ఈజీగా ఇలా కనిపెట్టేయండి..

సాధారణంగా, మనం పుచ్చకాయ కొనడానికి వెళ్లినప్పుడు, అది లోపల ఎర్రగా ఉందా లేదా అనే సందేహం వస్తుంది. అందుకే షాపువారిని ఒక ముక్క కత్తిరించి చూపించమని అడుగుతాము. ఇకపై ఆ అవసరం లేకుండానే దీన్ని కొనేయండి. మార్కెట్లో కనిపించే ఒక్కో పుచ్చపండు ఒక్కో సైజులో రంగులో కనపడుతూ ఉంటుంది. దీని వల్ల ఏది కొనాలో ఏది మంచిదో తెలియక కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటప్పుడు పుచ్చపండును ఈజీగా కనిపెట్టే టెక్నిక్స్ ఇవి.
పుచ్చకాయను కట్ చేసి చూపించమని అడిగి మరీ కొంటుంటారు. ఇలా చేయడం వల్ల అది లోపల ఎలా ఉంది దాని రుచి వంటివి తెలుసుకోవచ్చు. కానీ రెండు గంటల్లోపే అది పాడైపోవడం మొదలవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఆ మాత్రం కూడా తినలేం. కొన్ని అరుదైన రకం పుచ్చకాయలు ఉంటాయి. వాటిపై తెల్లని మచ్చలు ఉంటాయి. అలాంటి మచ్చలు ఉన్న పండ్లు చాలా తియ్యగా లోపల చాలా ఎర్రగా ఉంటాయి.
పుచ్చకాయ ఆకారం..
మీరు ఎంచుకునే పుచ్చకాయ గుడ్డు ఆకారంలో లేదా బంతి ఆకారంలో ఉండాలి. దానికి ఒక నిర్దిష్ట ఆకారం ఉండాలి. అలాంటి పుచ్చకాయ లోపల అన్ని వైపులా సమానంగా పండి ఉంటుంది. అలాగే, గింజల రేఖలు క్రమబద్ధమైన ఆకారంలో ఉంటాయి.
పుచ్చకాయ బరువు..
మీరు కొనే పుచ్చకాయ బరువుగా ఉంటే, అది రుచికరంగా ఉంటుంది. అంటే కనీసం 2 కిలోల బరువు ఉండాలి, అప్పుడు పండు మధ్యలో మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది చిన్న పుచ్చకాయలలో ఉండదు. కాబట్టి, మీరు కొంచెం పెద్దదిగా ఉండే పండును ఎంచుకోవడం మంచిది.
పుచ్చకాయ గట్టిగా ఉండాలి..
అది ఎక్కడా మృదువుగా ఉండకూడదు. అలా ఉంటే అది పాడైపోయిందని తెలుపుతుంది. పండును కొన్న 2 రోజుల్లో తినాలి. ఎందుకంటే పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అవి త్వరగా పాడైపోతాయి.
రంగు
పుచ్చకాయ కొనేటప్పుడు, దాని చర్మం పొడిగా ఉండాలి. చర్మం పచ్చగా ఉంటే, అది పండు కాదు. మీరు అలాంటి పుచ్చకాయను కత్తిరించినట్లయితే, అది లోపల ఎర్రగా ఉండదు. కాబట్టి, పండిన పుచ్చకాయకు పొడి, వాడిపోయినట్టుగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి.
పసుపు రంగు ఉంటే..
కొన్ని పుచ్చకాయలు పచ్చని రంగుకు బదులుగా ఒక వైపు పసుపు రంగును కలిగి ఉంటాయి. అలాంటి పుచ్చకాయలు కూడా లోపల ఎర్రగా ఉంటాయి. పసుపు రంగుకు కారణం, పండు పండినప్పుడు, పసుపు రంగు భాగం నేలకు అతుక్కుపోతుంది. అది నొక్కబడుతుంది. అందువల్ల ఆ భాగం మందంగా అవుతుంది. ఈ విధంగా, పుచ్చకాయ కొనేటప్పుడు మనం ఈ విషయాలపై శ్రద్ధ వహిస్తే రుచికరమైన పండును కొని తినవచ్చు.