AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్‌లోని ఈ పార్ట్ తింటున్నారా..? ఇవి తెలిస్తే అస్సలే ముట్టుకోరు..

చికెన్ గిజార్డ్స్‌లో ప్రోటీన్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ ఇందులో ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి అవి సురక్షితమేనా..? యూరిక్ యాసిడ్ ఉన్నవారు తింటే ఏమవుతుంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Chicken: చికెన్‌లోని ఈ పార్ట్ తింటున్నారా..? ఇవి తెలిస్తే అస్సలే ముట్టుకోరు..
The Hidden Dangers Of Chicken Gizzards
Krishna S
|

Updated on: Sep 22, 2025 | 8:41 PM

Share

చికెన్ ఎవరికి ఇష్టం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టంగా తింటారు. ఇది ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరుగా పేరుపొందింది. చికెన్ మాంసం మాత్రమే కాదు, దానిలోని ఇతర భాగాలు కూడా అనేక ప్రాంతాల్లో వంటల్లో వాడతారు. అలాంటి వాటిలో ఒకటి చికెన్ గిజార్డ్. పోషకాలతో నిండి ఈ గిజార్డ్స్ రుచికరంగా ఉండడంతో పాటు  తక్కువ ధరకే దొరుకుతాయి. అయితే అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి ఇవి సురక్షితమేనా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

గిజార్డ్ అంటే ఏమిటి?

చికెన్ గిజార్డ్స్ అనేవి కోళ్ల జీర్ణవ్యవస్థలో ఉండే చిన్న, కండరాల అవయవం. కోళ్లకు దంతాలు ఉండవు కాబట్టి, అవి తినే ఆహారాన్ని రుబ్బి జీర్ణం చేయడానికి ఈ గిజార్డ్స్ సహాయపడతాయి. అందుకే ఇవి చాలా బలంగా, గట్టిగా ఉంటాయి. గిజార్డ్స్‌లో ప్రోటీన్, ఐరన్, జింక్, సెలీనియం, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి.

అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి ప్రమాదమా?

చెన్నైలోని ఏజ్‌లెస్ ఫిట్‌నెస్ నిపుణుడు, డాక్టర్ సంతోష్ జాకబ్ ప్రకారం.. ఒక చికెన్ గిజార్డ్‌లో 7 నుండి 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే గిజార్డ్స్ వంటి అవయవ మాంసాలలో ప్యూరిన్స్ అనే పదార్థాలు అధికంగా ఉంటాయి. మన శరీరంలో ప్యూరిన్లు విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.

రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే గౌట్ అనే బాధాకరమైన కీళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే గౌట్ లేదా అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు చికెన్ గిజార్డ్స్‌ను తక్కువగా తినడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని డాక్టర్ జాకబ్ హెచ్చరిస్తున్నారు. న్యూట్రియంట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. గౌట్ సమస్య ఉన్నవారు అవయవ మాంసాలను తినడం పరిమితం చేసుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తుంది.

చికెన్ గిజార్డ్స్ చాలామందికి ఆరోగ్యకరమైన ఆహారమే. అవి పోషకాలు, ప్రోటీన్లతో నిండి, తక్కువ కొవ్వుతో ఉంటాయి. కానీ మీకు గౌట్ లేదా అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే, వాటిని తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ఆరోగ్యవంతులకు మాత్రం ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా సురక్షితమే.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.