Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lazy Day: అరెరె.. బద్ధకంతో బోలెడు ప్రయోజనాలట..! రోజంతా ఖాళీగా ఉంటే..

ఏమీ చేయబుద్ది కావట్లేదా? రోజంతా బద్దకంగా ఉంటున్నారా? ఏ పని చేయలేకపోవడం వల్ల మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బద్దకం మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఏడాదిలో ఓ రోజు లేజీడేని కూడా జరుపుకుంటుంటారు.

Lazy Day: అరెరె.. బద్ధకంతో బోలెడు ప్రయోజనాలట..! రోజంతా ఖాళీగా ఉంటే..
Being Lazy
Follow us
Bhavani

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 12, 2025 | 12:35 PM

అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటేంటే మీరు మాత్రం దుప్పటి కప్పుకుని సోఫా మీద ముసుగేశారా. ఏం పర్లేదు. పొద్దున్న లేస్తే ఆ రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు ఇలా ఉండాలి.. అది చేయాలి అని చెప్పేవారే. కానీ ఓ రోజు మీకోసం మీకు నచ్చినట్టు గడపండి. మీకేం చేయాలనిపిస్తే మరో ఆలోచన లేకుండా చేసేయండి. ఒక రోజు మీ బ్రెయిన్ చెప్పినట్టు వింటే తప్పు లేదంటున్నారు మానసిన నిపుణులు. నిజం చెప్పాలంటే ఉరుకులు పరుగుల జీవితంలో విశ్రాంతి తీసుకోవడం కూడా ఓ అచీవ్ మెంట్ గానే మారిపోయింది. మీకెప్పుడైనా ఎక్కువ సమయం పనిచేసినందుకు అపరాధ భావన కలిగిందా.. లేదు కదా. ఇది కూడా అలాగే. ఓసారి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడంలో తప్పేం లేదు. ఇది మీ బ్రెయిన్ కు ఓ చిన్నపాటి కానుక లాంటిదట.

కాలంతో పరిగెత్తకండి..

నిత్యం సోషల్ మీడియాలో ఉండేవారి మెదడు నిరంతరం ఆ కంటెంట్ ను తీసుకునేందుకు పోరాడుతూనే ఉంటుంది. హార్మోన్లు ఒత్తిడికి గురవుతాయి. వారిలో శ్రద్ధ, క్రియేటివిటీ తగ్గిపోతుంటాయి. దీనికి బదులు ఏ పనీ చేయకుండా ఓరోజు ఖాళీగా ఉండేందుకు ప్రయత్నించాలట. ఎలాగైతే వారంలో ఒకరోజు ఉపవాసం చేసి జీర్ణవ్యవస్జకు రెస్ట్ ఇస్తామో.. ఇది బ్రెయిన్ యాక్టివిటీకి రెస్ట్ ఇవ్వడంలా అన్నమాట.

సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది..

మనకు ఈ విషయం కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇటాలియన్లు ఈ పద్దతిని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు. ఏమీ చేయకుండా ఉండి చూడు అందులో ఉన్న ఆనందం తెలుస్తుంది అంటున్నారు. ఇలా ఉండటం వల్ల అది మీ మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మెరుగు చేస్తుందట. అస్తవ్యస్తంగా ఉండే మీ ఆలోచనా తీరుకు ఓ స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త కొత్త ఐడియాలు మీ బుర్రలోకి వస్తాయి. మీరు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఓ సమస్య విషయంలో ఉన్నట్టుండి పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువగా ఆలోచించకుండా అలా కూర్చుని ఉండగలిగితే అది మీ మనసుకు, శరీరానికి విశ్రాంతి కలిగిస్తుంది.

కొత్త ఉత్సాహం మీ సొంతం..

మీరు రెస్ట్ మోడ్ లో ఉంటూ కూడా ఆఫీసులో పనిగురించో, మీరంటే పడని వారి గురించో దీర్ఘాలోచనలో మునిగిపోతే ఆ టెక్నిక్ పనిచేయదు. మీ ఫోన్ లో ముందుగా నోటిఫికేషన్ టోన్ ను ఆపేయండి. అలారం, ఈ మెయిల్స్ లేకుండా చూసుకోండి. నిర్మలంగా ఉండే ఆకాశం వైపు కాసేపు చూడండి. ఇలా మీ మనసును శాంతింపజేస్తే మీరు ఊహించనంత ఉత్సాహంతో మరుసటి రోజు కోసం సిద్ధమవుతారని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇదే క్రమంలో బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు. బద్ధకం అనేది రీఫ్రెష్ మెంట్ కోసమే తప్ప పని చేయకుండా తప్పించుకోవడానికి కాదంటున్నారు వైద్యులు.