AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cornstarch Hacks: మొక్కజొన్న పిండిని ఇలా వాడితే.. మీ కిచెన్‌ను తళతళలాడించొచ్చు!

వంటకాల తయారీలో కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) ప్రధాన పాత్ర పోషిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ మెత్తని తెల్లని పొడి వంటలకు రుచిని అందించడమే కాకుండా, ఎన్నో కష్టమైన ఇంటి పనులను కూడా సులభతరం చేస్తుందని మీకు తెలుసా? మీ డ్రాయింగ్ రూమ్‌లోని అద్దాలను మెరిపించడం నుంచి మీకు ఇష్టమైన బట్టలపై నూనె మరకలను..

Cornstarch Hacks: మొక్కజొన్న పిండిని ఇలా వాడితే.. మీ కిచెన్‌ను తళతళలాడించొచ్చు!
Cornstarch Hacks For Kitchen
Srilakshmi C
|

Updated on: Apr 17, 2026 | 8:46 PM

Share

వంటగదిలో సూప్‌లను చిక్కగా చేయడం నుంచి కరకరలాడే పకోడాల వరకు ప్రతి వంటకం తయారీలోనూ కార్న్‌ఫ్లోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ మెత్తని తెల్లని పొడి వంటలకు రుచిని అందించడమే కాకుండా, ఎన్నో కష్టమైన ఇంటి పనులను కూడా సులభతరం చేస్తుందని మీకు తెలుసా? మీ డ్రాయింగ్ రూమ్‌లోని అద్దాలను మెరిపించడం నుంచి మీకు ఇష్టమైన బట్టలపై నూనె మరకలను తొలగించడం వరకు కార్న్‌స్టార్చ్ ఎన్నో రకాలుగా వంటగదిలో ఉపయోగపడుతుంది.

బట్టలపై మొండి మరకలు

మీకు ఇష్టమైన బట్టలపై నూనె మరక పడి ఎంతకు వదలడంలేదా? చింతించకండి. ఆ నూనె మరకపై కొద్దిగా కార్న్‌స్టార్చ్ చల్లి, 15-20 నిమిషాల పాటు అలానే వదిలేయండి. అది నూనెను పీల్చుకుంటుంది. అనంతరం ఉతికితే మరక సులభంగా పోతుంది. అలాగే తెల్లటి కాటన్ బట్టలకు ఉతికిన తర్వాత గంజి లేదా స్టార్చ్‌కు బదులుగా కార్న్‌స్టార్చ్‌ను ఉపయోగించి చూడండి. ఒక కప్పు నీటిలో ఒక చెంచా కార్న్‌స్టార్చ్‌ను మరిగించి చిక్కబడనివ్వాలి. ఆ తర్వాత దానిని రెండున్నర నుంచి మూడు లీటర్ల నీటిలో కరిగించి బట్టలను అందులో ముంచి, ఆరబెట్టి, ఇస్త్రీ చేస్తే కొత్తవాటిలాగా మెరిసిపోతాయి.

బూట్లు, తల జిగురు

వేసవిలో లేదా వర్షాకాలంలో చెమట వల్ల మీ జుట్టు జిగటగా అనిపిస్తుందా? మీకు సమయం తక్కువగా ఉంటే కార్న్‌స్టార్చ్‌ను డ్రై షాంపూగా ఉపయోగించవచ్చు. మీ జుట్టు కుదుళ్లపై కొద్దిగా పొడి చల్లి, బ్రష్‌తో దువ్వితే చాలు. మీ జుట్టు మళ్లీ పట్టులా మృదువుగా మారుతుంది. అదేవిధంగా ఇది బూట్ల వాసనను తొలగించడానికి కూడా బాగా పనిచేస్తుంది. రాత్రిపూట బూట్లలో కొద్దిగా పొడి వేసి, ఉదయాన్నే వాటిని దులిపివేస్తే వాసన పోతుంది.

ఇవి కూడా చదవండి

పాదాల ఇన్ఫెక్షన్

ఎక్కువగా చెమట పట్టే వారికి లేదా అథ్లెట్స్ ఫుట్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వారికి కార్న్‌స్టార్చ్ ఒక గొప్ప నివారణ. ఇది తేమను పీల్చుకుని పాదాలను పొడిగా ఉంచుతుంది. సాక్సులు వేసుకునే ముందు మీ పాదాలపై లేదా సాక్సుల లోపల కొద్దిగా చల్లుకుంటే కాలిగోళ్లు రోజంతా పొడిగా, దురద లేకుండా ఉంటాయి.

గాజు కిటికీ

కిటికీ అద్దాలు లేదా డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు తరచుగా మరకలు పడతాయి. ఇలాంటి సందర్బాల్లో చిన్న కాటన్‌ గుడ్డపై కొద్దిగా మొక్కజొన్న పిండిని రుద్ది అద్దాన్ని శుభ్రం చేస్తే.. ఎలాంటి ద్రవ క్లీనర్ లేకుండానే అద్దం వజ్రంలా మెరవడం మీరు చూస్తారు.

వంటగది చిట్కాలు

మంచూరియన్ లేదా చేపలను వేయించేటప్పుడు పైన పలుచగా కార్న్‌స్టార్చ్ పూత వేయడం వల్ల నూనె తక్కువగా పీల్చుకుని ఆహారం చాలా సేపటి వరకు కరకరలాడుతూ ఉంటుంది. కేకులు లేదా పేస్ట్రీలు తయారుచేసేటప్పుడు పిండిలో కొద్దిగా కార్న్‌స్టార్చ్ కలపడం వల్ల అవి చాలా మృదువుగా, స్పాంజిలా తయారవుతాయి. కాబట్టి కార్న్‌స్టార్చ్‌ను కేవలం వంట పదార్థంగానే కాకుండా ఇంటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంతో పొదుపు, శుభ్రత రెండూ ఒకేసారి సాధ్యమవుతాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us