ఏసీ, కూలర్‌ నడుస్తున్నప్పుడు..ఫ్యాన్‌ వేసి ఉంచాలా వద్దా..? తప్పక తెలుసుకోండి..

ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్లు వేయకూడదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, ఏసీ ఆన్‌ చేసినప్పుడు ఫ్యాన్‌ కూడా ఆన్‌లోనే ఉంటే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మీరు ఫ్యాన్ ని టాప్ స్పీడ్ లో కాకుండా రెండు లేదా మూడులో పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు అంది ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం...

ఏసీ, కూలర్‌ నడుస్తున్నప్పుడు..ఫ్యాన్‌  వేసి ఉంచాలా వద్దా..? తప్పక తెలుసుకోండి..
Summer Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 12, 2024 | 12:48 PM

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు పరుగులు పెడతాయి. ఇంట్లో ఏసీ, కూలర్‌ ఆన్‌ చేసిన వెంటనే కొందరు ఫ్యాన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేస్తుంటారు. మరికొందరు ఫ్యాన్‌లు ఆన్‌లోనే ఉంచుతున్నారు. అయితే, ఈ రెండు విధనాల్లో ఏది కరెక్ట్‌..! ఏసీ, కూలర్‌తో పాటు ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే ఏమవుతుంది..? వేస్తే ఏంటి నష్టం..? ఇలాంటి సందేహాలు చాలా మందిని ఇరుకున పడేస్తుంటాయి. ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్లు వేయకూడదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, ఏసీ ఆన్‌ చేసినప్పుడు ఫ్యాన్‌ కూడా ఆన్‌లోనే ఉంటే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మీరు ఫ్యాన్ ని టాప్ స్పీడ్ లో కాకుండా రెండు లేదా మూడులో పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు అంది ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం…

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేసుకునే అలవాటు ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు..ఎందుకంటే.. ఏసీ వేసుకుని ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేకపోగా, లాభమనే ఉందని చెప్పాలి. ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల ఏసీ గాలి రూమ్ మొత్తానికి త్వరగా వ్యాపిస్తుంది. అలాగే మీ గది వేగంగా చల్లబడేలా చేస్తుంది. అంతేకాకుండా ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు ఏసీని తక్కువలో పెట్టుకున్నా చల్లగా ఉందనే భావన కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఏసీని మరీ తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో గది నుండి చల్లని గాలి బయటకు రాకుండా అన్ని కిటికీలు, తలుపులను జాగ్రత్తగా మూసివేయండి. ఇలా చేస్తే మరింత త్వరగా మీ రూమ్‌ చల్లబడుతుంది. దీంతో కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు మీ గదిని త్వరగా చల్లబరిచేందుకు ఫ్యాన్, కూలర్ రెండింటినీ ఒకేసారి నడపాలంటే ఉపయోగం ఉండదు. సీలింగ్ ఫ్యాన్లు, కూలర్లు రెండూ గాలిని ప్రసరించడానికి పని చేస్తాయి. కానీ అవి వ్యతిరేక దిశల్లో వీస్తున్నాయి. కాబట్టి ఈ రెండు పరికరాలను ఒకేసారి ఉపయోగించకూడదు.

ఇవి కూడా చదవండి

సీలింగ్ ఫ్యాన్ పై నుండి గాలిని లాగుతుంది. కూలర్ దిగువ నుండి గాలిని లాగుతుంది. ఈ రెండు డివైజ్‌లు ఏకకాలంలో నడుస్తుంటే రెండింటి నుంచి వచ్చే గాలి ఒకదానికొకటి ఢీకొంటుంది. కాబట్టి రెండింటినీ ఒకేసారి నడపడం వల్ల వాటి వాయు ప్రవాహాన్ని నిరోధించేలా చేస్తుంది. మీరు కోరుకున్న చల్లదనాన్ని పొందలేకపోతారు. ఒక చిన్న గదిని పరిగణనలోకి తీసుకుని, కూలర్‌,ఫ్యాన్‌ రెండు పరికరాలు ఏకకాలంలో నడుస్తున్నట్లయితే, చల్లటి గాలి అస్సలు అందదు. ఎందుకంటే ఈ ప్రదేశంలో గాలి ప్రవాహం తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…