AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ ఆవు క్రమశిక్షణ చూస్తే అవాక్కే..! కూరగాయల వ్యాపారిని ఎలా బుజ్జగిస్తుందో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే..

తన చుట్టూ కావాల్సినంత ఆహారం ఉన్నప్పటికీ.. యజమాని పెట్టకుండా ఆ ఆవు ఎలాంటి ఆహారం తినలేదు.. ఆశ్చర్యకరంగా, అమ్మకందారుడు వాటిని అందిస్తే తప్ప ఆవు తినదు. అందుకే విధేయత కలిగిన ఆవు చేసిన పనిని పలువురు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

Watch Video: ఈ ఆవు క్రమశిక్షణ చూస్తే అవాక్కే..! కూరగాయల వ్యాపారిని ఎలా బుజ్జగిస్తుందో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే..
Cow Cuddling Seller
Jyothi Gadda
|

Updated on: Apr 12, 2024 | 12:22 PM

Share

ఇటీవలి కాలంలో పెంపుడు జంతువుల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పిల్లులు, కుక్కలు, తాబేళ్లు వంటి జంతువులను చాలా మంది ఎంతో ఇష్టంగా తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. కానీ, కొందరు రోడ్లపై విచ్చలవిడిగా తిరగే జంతువులను కూడా ఇంట్లోని సభ్యులుగా చూసుకుంటారు. అలాగే, జంతువులకు ప్రేమ, స్పర్శ భాష తెలుసు. అలా మనిషికి, జంతువులకు మధ్య ప్రేమపూర్వక సంబంధం ఏర్పడుతుంది. ఈరోజు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ఒక ఆవు కూరగాయల వ్యాపారిని ఎలా బుజ్జగిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియో ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి సంబంధించినదని తెలుస్తుంది. ఒక కూరగాయల అమ్మకందారుడు తన వద్దకు వచ్చిన కస్టమర్‌కి కూరగాయలు అమ్ముతున్నాడు. అంతలోనే ఆ వ్యక్తి దగ్గరికి ఒక ఆవు వచ్చి నిలబడింది. ఆహారం కోసం వెతుకుతున్న ఆ ఆవు కూరగాయల వ్యాపారి వద్ద నిలబడి అతనితో మారాం చేస్తూ కనిపిస్తుంది. వ్యాపారం మెడపై ఆవు తన ముఖం పెట్టి గారాలు పోతూ ఏదో బ్రతిమాలుకుంటున్నట్టుగా ప్రవర్తించింది. అలా.. ఆ వ్యాపారి కస్టమర్‌కు కూరగాయలు అందించిన తర్వాత, ఆవుకు టమోటాలు తినిపించాడు. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను ఒక్కసారి చూడండి.

ఇవి కూడా చదవండి

అది ఒక కూరగాయల మార్కెట్.. ఎటు చూసిన కావాల్సినన్ని కూరగాయలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ ఆవు వ్యాపారిని బతిమాలుకుంటున్న తీరు అందరినీ ఆలోచనలో పడేస్తుంది. తన చుట్టూ కావాల్సినంత ఆహారం ఉన్నప్పటికీ.. యజమాని పెట్టకుండా ఆ ఆవు ఎలాంటి ఆహారం తినలేదు.. ఆశ్చర్యకరంగా, అమ్మకందారుడు వాటిని అందిస్తే తప్ప ఆవు తినదు. అందుకే విధేయత కలిగిన ఆవు చేసిన పనిని పలువురు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో X (Twitter) ఖాతా @drvikas1111 నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఆవును ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కొత్త ఏసీ.. ఇవి కచ్చితంగా చెక్ చేయండి!
కొత్త ఏసీ.. ఇవి కచ్చితంగా చెక్ చేయండి!
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!