Watch Video: ఓరీ దేవుడో.. క్యారెట్ ఇలా కడిగి అమ్ముతున్నారా..? నెటిజన్ల రియక్షన్ ఎలా ఉందంటే..
ఈ వీడియో చూసిన తర్వాత మీరు క్యారెట్ తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు. ఇప్పటికే మార్కెట్‌లో పెద్ద ఎత్తున మోసపోతున్నాం. ఇప్పుడు మనకు కల్తీ ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే - ఇప్పుడు ఆహార పదార్థాలన్నీ కల్తీ. అందుకే ఇటీవల అనారోగ్యాల రేటు పెరిగింది.
అన్ని రకాల కూరగాయలు తినాలని చెబుతుంటారు. మంచి ఆరోగ్యం కోసం అన్ని కూరగాయలను మనం ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. కూరగాయలు మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని భావిస్తాం. కానీ, అవే కూరగాయలు ఇప్పుడు మనల్ని భయపెడుతున్నాయి. కారణం- కూరగాయల పంట మొదలు మార్కెట్‌లో విక్రయించే వరకు.. చుట్టూ పెరిగిపోయిన అపరిశుభ్రత ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరలు, కూరగాయలు హానికరంగా మారుతుండడంతో వినియోగదారులు కూరగాయలు తింటున్నా.. రోగాలు తప్పేలా లేవని భయపడిపోతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత కూరగాయలు నేరుగా పొలం నుంచి తెచ్చుకోవాలంటే కూడా జంకుతారు.?
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని పచ్చిగా కూడా తింటారు. క్యారెట్ హల్వా తయారు చేస్తారు. కానీ, క్యారెట్ మనకు ఎలా చేరుతుందో చూస్తే మాత్రం మీ పాదాల క్రింద నేల కదులుతుంది. కూరగాయలు అమ్మేవారి జుగుప్సాకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వారు క్యారెట్లు కడగడం చూస్తే మీరు కంగుతింటారు. వీడియోలో చాలా మంది వ్యక్తులు క్యారెట్‌లతో నదికి సమీపంలో పెద్ద డబ్బాలో కూర్చుని ఉన్నారు.. ఒక వ్యక్తి బకెట్ నుండి ఈ క్యారెట్లపై నీరు పోస్తున్నాడు. మిగిలిన వాళ్ళు హాయిగా కూర్చుని కాళ్లతో క్యారెట్‌లను రుద్దుతూ కనిపిస్తున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కడి నుండి వచ్చిందనే సమాచారం తెలియదు గానీ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఇలా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారేంటీ..?అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
ఈ వీడియోను foodie_saurabh_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యంపై ఖచ్చితంగా చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు క్యారెట్ తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు. ఇప్పటికే మార్కెట్‌లో పెద్ద ఎత్తున మోసపోతున్నాం. ఇప్పుడు మనకు కల్తీ ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే – ఇప్పుడు ఆహార పదార్థాలన్నీ కల్తీ. అందుకే ఇటీవల అనారోగ్యాల రేటు పెరిగింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..