అయ్య బాబోయ్‌… మాంసం కొట్టే కత్తులతో మసాజ్..! ఎలా చేస్తారో తెలిస్తే వెన్నులో వణుకు ఖాయం..? ఎక్కడంటే..

ఇక్కడి ఒక పార్లర్‌లో మసాజ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. అతని మాటల్లోనే.. నేను కత్తితో మసాజ్ చేసుకునేందుకు ఎదురుచూస్తూ టేబుల్‌పై పడుకుని ఉన్నాను. థెరపిస్ట్ ఎల్సా మొదట తన చేతులతో నా శరీరాన్ని నొక్కుతూ ఒత్తిడిని పెంచటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వారు నా శరీరంపై రెండు చల్లని స్టీల్ కత్తులు ఊపడం ప్రారంభించారు.

అయ్య బాబోయ్‌... మాంసం కొట్టే కత్తులతో మసాజ్..! ఎలా చేస్తారో తెలిస్తే వెన్నులో వణుకు ఖాయం..? ఎక్కడంటే..
Dangerous Massage In China
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 12, 2024 | 11:56 AM

శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు బాడీ మసాజ్ చక్కటి మార్గం. పురాతన కాలం నుండి ఆసియా దేశాలలో మసాజ్ ఆచరణలో ఉంది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్పాలు దీన్ని చేస్తున్నాయి. వీటిలో ఆయిల్ మసాజ్, నీడిల్ మసాజ్, మడ్ మసాజ్ ఉన్నాయి. అయితే నైఫ్ మసాజ్ కూడా చేస్తారని మీకు తెలుసా? ఈ విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. మటన్ లేదా చికెన్ కొట్టే భారీ సైజున్న కత్తితో ఈ మసాజ్ చేస్తారు. ఆసియా దేశాలలో నైఫ్ మసాజ్ భిన్నంగా ఉండటమే కాకుండా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు. ఇది ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే ఈ మసాజ్‌ను తైవాన్‌లో పాటిస్తారు. ఈ మసాజ్ కోసం ఇక్కడ 2000 సంవత్సరాలకు పైగా పాత పద్ధతిని ఉపయోగిస్తారు.

రాజధాని నగరం తైపీలో ఈ రకమైన మసాజ్‌ను అందించే అనేక పార్లర్‌లు ఉన్నాయి. ఇందులో, థెరపిస్ట్, రసాయనాలతో రెండు కత్తులను శుభ్రం చేసిన తర్వాత, మొత్తం శరీరంపై తేలికగా కొడుతూ ఉంటారు.. అయితే, కత్తి దాడికి ముందు ఆ వ్యక్తి శరీరాన్ని పూర్తిగా ఒక గుడ్డతో కవర్‌ చేసిన తర్వాత మసాజ్‌ మొదలుపెడతారు. తైపీలోని ఓ పార్లర్‌లో మసాజ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. అతని మాటల్లోనే.. నేను కత్తితో మసాజ్ చేసుకునేందుకు ఎదురుచూస్తూ టేబుల్‌పై పడుకుని ఉన్నాను. థెరపిస్ట్ ఎల్సా మొదట తన చేతులతో నా శరీరాన్ని నొక్కుతూ ఒత్తిడిని పెంచటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వారు నా శరీరంపై రెండు చల్లని స్టీల్ కత్తులు ఊపడం ప్రారంభించారు. ముందుగా నా వీపుపై, చేతిపై కత్తితో తేలిగ్గా దాడి చేశారు. ఆ తరువాత ఇది నా తల, మెడపై కూడా చేశారని మసాజ్‌ చేయించున్న ఆ వ్యక్తి వివరించారు. కానీ అప్పుడు తన శరీరం వణికిపోయిందని చెప్పాడు. అయితే, కత్తుల శబ్దం లేకపోతే ఆ మసాజ్ అంటే ఏమిటో కూడా తనకు తెలిసేకాదని అన్నాడు.

ఇక తనకు మసాజ్‌ చేస్తున్న ఎల్సా మూడోసారి తన శరీరాన్ని వదులుగా ఉంచాలని కోరినట్టుగా చెప్పారు. వారి సూచనలను అనుసరించి కళ్ళు మూసుకున్నానని, ఆ తరువాత వారు తమ పని చేశారని చెప్పాడు. నివేదిక ప్రకారం, ఇది చైనా బౌద్ధ సన్యాసులచే ప్రచారం చేయబడింది. అదే సమయంలో సుమారు 1,000 సంవత్సరాల క్రితం, టాంగ్ రాజవంశం దీనిని జపాన్‌కు విస్తరించింది. 1940లలో చైనాలో జరిగిన అంతర్యుద్ధం నుండి తైవాన్‌లో ఈ మసాజ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. జపాన్, చైనాలలో ఈ రోజుల్లో నైఫ్ మసాజ్ పార్లర్‌లు దొరకడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో, ఇటీవలి సంవత్సరాలలో తైవాన్‌లో దాని ట్రెండ్ తిరిగి ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

ఇది ఎలా జరుగుతుంది..?

మసాజ్ సమయంలో శరీరంపై ఒత్తిడి పాయింట్లకు ప్రెజర్‌ అప్లై చేస్తారు.. ఇది చైనాలో చికిత్స కోసం ఉపయోగించే ఆక్యుపంక్చర్ పద్ధతిని పోలి ఉంటుంది. అదే సమయంలో, శిక్షణ కోసం వచ్చే వ్యక్తులు ఈ పెద్ద ఉక్కు కత్తులలో ఏదో కనిపించని శక్తి ఉందని నమ్ముతారు. ఇది ఒత్తిడి నుండి మాత్రమే కాకుండా వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు. మసాజ్ చేయడానికి ముందు, మర్దన చేయించుకునే వ్యక్తి ఉదయాన్నే పచ్చి ఉప్పు కలిపిన వేడి నీటితో స్నానం చేయాలని చెబుతారు. ఈ స్నానం కనీసం 15 నిమిషాలు ఉంటుంది. ఇది శరీర కండరాలను మృదువుగా చేస్తుంది. కత్తితో మసాజ్ చేయడం మరింత ప్రభావవంతంగా మారుతుంది. ఇందులో కత్తుల అంచులు మొండిగా చేసిన తర్వాత మసాజ్ చేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి