మహిళా వెయిటర్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం.. రోబోటిక్ కదలికలు చూసి షాక్..

వెయిటర్ వ్యక్తీకరణను బట్టి చూస్తే.. ఆమె నిజమైన మహిళ అని మీరు అనుకోలేరు. ఎందుకంటే ఆమె నడిచే విధానం నుంచి మాట్లాడే విధానం వరకు, అచ్చం రోబోలా అనిపిస్తుంది. ఈ వీడియో చైనాకు చెందిన 'చాంగ్‌కింగ్ హాట్‌పాట్ రెస్టారెంట్'కి చెందినది. మహిళను రెస్టారెంట్ యజమానిగా గుర్తించారు. ఆమె ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. ఆ మహిళ కూడా రోబోలాగా శబ్దాలు చేస్తూ మాట్లాడుతుందని ప్రచారం జరుగుతోంది.

మహిళా వెయిటర్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం.. రోబోటిక్ కదలికలు చూసి షాక్..
Waitress Serving FoodImage Credit source: Instagram/@balakrishnanrbk
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2024 | 11:57 AM

చైనీస్ రెస్టారెంట్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో మహిళా వెయిటర్ కస్టమర్లకు ఆహారం అందిస్తున్న తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియోలో  మహిళా వెయిటర్‌ను ‘హ్యూమనోయిడ్ రోబో’గా చూపించారు. వెయిటర్ వ్యక్తీకరణను బట్టి చూస్తే.. ఆమె నిజమైన మహిళ అని మీరు అనుకోలేరు. ఎందుకంటే ఆమె నడిచే విధానం నుంచి మాట్లాడే విధానం వరకు, అచ్చం రోబోలా అనిపిస్తుంది.

ఈ వీడియో చైనాకు చెందిన ‘చాంగ్‌కింగ్ హాట్‌పాట్ రెస్టారెంట్’కి చెందినది. మహిళను రెస్టారెంట్ యజమానిగా గుర్తించారు. ఆమె ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. ఆ మహిళ కూడా రోబోలాగా శబ్దాలు చేస్తూ మాట్లాడుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మహిళ మాట్లాడిన మాట్లాడు విన్న తర్వాత.. ఆ మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయం తీసుకున్నట్లు ఎవరికైనా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను బాలకృష్ణన్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది డైనింగ్ యొక్క భవిష్యత్తు కు చిహ్నం అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ మహిళ రోబోటిక్ కదలికలపై పట్టు సాధించడమే కాకుండా, AI లాగా ధ్వనించే విధంగా తన స్వరాన్ని కూడా బాగా శిక్షణ పొందింది.

ఇక్కడ వీడియో చూడండి

ఇది రోబోనా లేక మనిషా

కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో శర వేగంగా వైరల్ అవుతోంది. వెయిటర్ రోబో కాదు మహిళ అని తెలిసినా.. ఆమె కదలికలు చూసి జనాలు కంగారు పడుతున్నారు. మీరు తిన్న తర్వాత డబ్బులు  చెల్లించకుండా పారిపోతే.. అది మిమ్మల్ని ఇన్‌స్పెక్టర్ లాగా పట్టుకుని, ఆపై మిమ్మల్ని కొడుతుందని ఒకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరొకరు ఇది మానవుడా లేదా రోబోటా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మరొకరు మాట్లాడుతూ, మనుషులకు బదులుగా రోబోలు పనిచేసే రెస్టారెంట్‌కి వెళ్లడం నాకు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..