పాలతో అభిషేకం చేసిన మహిళలకు సంతానాన్ని వరంగా ఇచ్చే కాళికాదేవి.. ఆలయ విశిష్టత ఏమిటంటే..

అంబాలాలోని  కాళీ దుఖ భంజని ఆలయంలో కాళికాదేవిని చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు. ఇలా అమ్మవారికి పాలతో అభిషేకం చేయడానికి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు తీరతారు.  ఇలా నవరాత్రులలో అమ్మవారిని పాలతో స్నానం చేసే దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఈ దేవాలయాలలో అంబాలా నగరంలో కాళీ దుఖ భంజని ఆలయం ప్రసిద్ధి చెందింది.

పాలతో అభిషేకం చేసిన మహిళలకు సంతానాన్ని వరంగా ఇచ్చే కాళికాదేవి.. ఆలయ విశిష్టత ఏమిటంటే..
Dukhbhanjani Kali Temple
Follow us

|

Updated on: Apr 12, 2024 | 10:37 AM

హిందూ ధర్మంలో అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించి వివిధ రూపాల్లో పూజిస్తారు. దుర్గాదేవి, కాళిక, లక్ష్మీదేవికి దేశంలో పలు ఆలయాలున్నాయి. అలాంటి పవిత్ర అమ్మవారి ఆలయం ఉత్తర ప్రదేశ్‌లోని అంబాలాలోని కాళికాదేవి ఆలయం. ఇక్కడ కాళిని పూజించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కాళీ దుఖ భంజని ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఇక్కడ ఉన్న అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే ఆ తల్లి దీవెనలు లభిస్తాయని నమ్ముతారు.

పురాతన కాళీ దుఖ భంజని ఆలయం

అంబాలాలోని  కాళీ దుఖ భంజని ఆలయంలో కాళికాదేవిని చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు. ఇలా అమ్మవారికి పాలతో అభిషేకం చేయడానికి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు తీరతారు.  ఇలా నవరాత్రులలో అమ్మవారిని పాలతో స్నానం చేసే దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఈ దేవాలయాలలో అంబాలా నగరంలో కాళీ దుఖ భంజని ఆలయం ప్రసిద్ధి చెందింది.

సంతానం అనుగ్రహించే కాళికాదేవి

అమ్మవారికి చేయించే పాల స్నానం గురించి ఆలయ పూజారీ మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలోని ఈ ఆలయంలో మాత్రమే అమ్మవారిని పాలతో స్నానం చేయిస్తారని దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయని చెప్పారు. ఎవరైతే అమ్మవారికి పాలతో స్నానం చేయించి పాలు, పండ్లు సమర్పిస్తారో ఆ స్త్రీలకు సంతానాన్ని  అనుగ్రహిస్తుంది. క్షీరసాగరం అనంతరం ఊరేగింపుగా అమ్మవారు భక్తుల ఇళ్లకు చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

6 రకాల వంటకాలు

కాళికా దేవి అమ్మవారికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి 56 రకాల వంటకాలు నైవేద్యంగా పెడతారు. అమ్మవారిని పాలతో స్నానం చేయించడం విశేష ఫలితాలను ఇస్తుందని ఆలయానికి వచ్చే భక్తులు చెబుతారు. ఈ రోజున అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే తల్లి సంతోషించి జీవితం సిరిసంపదలతో, సంతానంతో నిండిపోవాలని అనుగ్రహిస్తుందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆలయానికి వస్తున్నామని, తమ ప్రతి కోరికను అమ్మవారు తీర్చిందని భక్తులు సంతోషముగా చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు