Bhadradri: రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలంలో గదులను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే సౌకర్యం..

క్రోధి నామ సంవత్సరం శ్రీ రామ నవమి వేడుకలను పురష్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఉగాది పర్వదినం రోజున తిరువీడి సేవతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఈ,నేపథ్యంలో రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది. ఇప్పటికే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు, కౌంటర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు శ్రీరామ నవమి. శ్రీ రామ మహా పట్టాభిషేక ఉత్సవం. ఏప్రిల్ 17వ తేదీ శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

Bhadradri: రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలంలో గదులను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే సౌకర్యం..
Bhadrachalam Temple
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2024 | 8:13 AM

శ్రీరామనవమి అంటేనే ఊరూ వాడా సంబరం.. ఇక తెలుగువారి అయోధ్య భద్రాద్రిలో శ్రీ రామ నవమి వేడుకలు అంటే చాలు కల్యాణ కాంతులతో కళకళలాడే పరిసరాలు దర్శనం ఇస్తాయి. దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది. క్రోధి నామ సంవత్సరం శ్రీ రామ నవమి వేడుకలను పురష్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఉగాది పర్వదినం రోజున తిరువీడి సేవతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఈ,నేపథ్యంలో రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది. ఇప్పటికే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు, కౌంటర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు శ్రీరామ నవమి. శ్రీ రామ మహా పట్టాభిషేక ఉత్సవం. ఏప్రిల్ 17వ తేదీ శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు 18 తేదీ అంటే శ్రీ రామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు.

ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం బస చేసేందుకు వీలుగా గదులను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ఆలయ వెబ్‌సైట్: https: //book.bhadrachalamonline.com/book-hotel. ద్వారా ఆన్ లైన్ లోనే గదులను రిజర్వ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల షెడ్యూల్ :

ఏప్రిల్ 09 – ఉగాది, తిరువీడి సేవ

ఏప్రిల్ 13 – అంకురార్పణం

ఏప్రిల్ 14 – గరుడ పథ లేకనం

ఏప్రిల్ 15 – అగ్ని ప్రతిష్ట, ద్వజారోహణం

ఏప్రిల్ 16 – చతుఃస్థానార్చన, ఎదురుకోలు

ఏప్రిల్ 17 – శ్రీరామ నవమి కల్యాణం (ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.30)

ఏప్రిల్ 18 – శ్రీ రామ మహా పట్టాభిషేకం

ఏప్రిల్ 19 – సదస్యం, హంస వాహన సేవ

ఏప్రిల్ 20 – తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ

ఏప్రిల్ 21 – ఊంజల్ ఉస్తవం, సింహ వాహన సేవ

ఏప్రిల్ 22 – వసంతోత్సవం, హవనం, గజ వాహన సేవ

ఏప్రిల్ 23 – చక్రతీర్థం, పూర్ణాహుతి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..