AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: బ్లడ్‌ షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకోవాలి.? నిపుణులు ఏమంటున్నారు..

ప్రస్తుతం డయాబటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రమంతప్పకుండా బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ను చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు...

Lifestyle: బ్లడ్‌ షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకోవాలి.? నిపుణులు ఏమంటున్నారు..
Blood Sugar Test
Narender Vaitla
|

Updated on: Apr 12, 2024 | 1:17 PM

Share

ప్రస్తుతం డయాబటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రమంతప్పకుండా బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ను చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ ఎప్పుడు చేసుకోవాలి.? ఏ సమయంలో చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి ఆహారం తీసుకోక ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడాన్ని ఉత్తమ సమయంగా నిపుణులు చెబుతుంటారు. ఉదయం నిద్ర మేల్కొన్న తర్వాత మొదట రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

* అలాగే భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సరైన ఫలితం తెలుస్తుంది.

* ఇక ఆహారం తీసుకునే ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడం బెస్ట్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్‌ మోతాదు తీసుకోవడంలో సహాయపడుతుంది.

* అధిక దాహం, అలసట, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్లడ్‌ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక వ్యాయామం చేసే ముందు తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్‌ చేయించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని సరిగ్గా అంచనా వేయొచ్చు.

* ఇక తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి 80-130 mg/dL ఉండాలి అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో, ఆహారం తిన్న 1-2 గంటల తర్వాత 180 mg/dL కంటే తక్కువగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్