Heatwaves: వడగాల్పులు ఈ వ్యాధుల బారిన పడేలా చేస్తాయి.. నివారణ చిట్కాలు మీ కోసం
వేసవి సీజన్‌లో అతి పెద్ద సమస్య డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి కొరత. నిర్జలీకరణం చాలా ప్రమాదకరమైనది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది. ఒకొక్కసారి మరణ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ వేసవి కాలంలో ఏ సందర్భాల్లో శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవిస్తే వడగాల్పుల బారిన పడే అవకాశం ఉంది. హీట్ స్ట్రోక్ బారిన పడితే శరీరంలో బలహీనత, స్పృహ కోల్పోవడం, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి.
వేసవి కాలం వచ్చేసింది.. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతోంది. విపరీతమైన వేడి కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు , వడగాల్పులు కారణంగా ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఏయే వ్యాధులు ముప్పు పొంచి ఉన్నాయో.. వాటిని ఎలా నివారించకోవాలో వైద్యులు చెప్పిన విషయాలను తెలుసుకుందాం..
లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ హెచ్ ఘోటేకర్ మాట్లాడుతూ.. ఈ వేసవి సీజన్‌లో అతి పెద్ద సమస్య డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి కొరత. నిర్జలీకరణం చాలా ప్రమాదకరమైనది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది. ఒకొక్కసారి మరణ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ వేసవి కాలంలో ఏ సందర్భాల్లో శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవిస్తే వడగాల్పుల బారిన పడే అవకాశం ఉంది. హీట్ స్ట్రోక్ బారిన పడితే శరీరంలో బలహీనత, స్పృహ కోల్పోవడం, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి.
కనుక హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి శరీరంలో నిర్జలీకరణాన్ని నివారించడం చాలా ముఖ్యం. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా వాటర్ బాటిల్ ఉంచుకోండి. ప్రతి 2 గంటలకు నీరు త్రాగాలి. ఎండలో ఉంటే తలను గొడుగు లేదా స్కార్ఫ్ తో కవర్ చేసుకోండి. సన్ గ్లాసెస్ ధరించండి. ఎండలో ఎక్కువసేపు ఉండకండి. తినే ఆహారంలో పుచ్చకాయ, కీర దోసకాయ వంటి పండ్లను చేర్చుకోండి.
ఫుడ్ పాయిజన్ కలిగే ప్రమాదం
వేసవి కాలంలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు గణనీయంగా పెరుగుతాయని డాక్టర్ ఘోటేకర్ వివరిస్తున్నారు. ఎక్కువ మందిని విరేచనాలబారిన పడతారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరుగుతుంది. వేసవి కాలంలో ఈ సమస్య చాలా సాధారణం. ఈ సీజన్‌లో ఆహారం త్వరగా పాడైపోతుంది. అనేక రకాల బ్యాక్టీరియా ఆహారం మీద పెరుగుతాయి. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. దీని వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో వేసవిలో ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని తినకూడదు. అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండండి.
టైఫాయిడ్
ఈ వేసవి కాలంలో ఎక్కువ మంది టైఫాయిడ్ వ్యాధి బారిన పడతారు. ముఖ్యంగా పిల్లలలో ఎక్కువ కేసులు నమోదవుతాయి. చెడు ఆహారపు అలవాట్ల వల్ల లేదా బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ బారిన పడతారు. ఈ వ్యాధిలో జ్వరంతో పాటు తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఆయాసం వంటి సమస్యలు ఉంటాయి. గత కొంతకాలంగా టైఫాయిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడం చాలా ముఖ్యం. టైఫాయిడ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నిల్వ ఉన్న ఆహారం, స్ట్రీట్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి.
కంటి ఇన్ఫెక్షన్స్
వేసవిలో వేడిగాలుల వల్ల కంటికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. బలమైన సూర్యకాంతి కారణంగా కంటి కార్నియా దెబ్బతింటుంది. నిరంతరం సూర్యకాంతిలో ఉంటే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక కళ్ళను వేడి నుంచి రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ధరించాలి. కళ్ళను చల్లటి నీటితో రోజుకు మూడు, నాలుగు సార్లు కడగాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..