AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Relief Tips: ఒత్తిడితో సతమతమవుతున్నారా.. ఈ ఆసనం వేస్తే సెట్!

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌కు చేరువై.. చివరకు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంది. ఇంట్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంటుంది. చివరకు మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీని వల్ల డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒత్తిడికి ముందుగానే చెక్ పెడితేనే..

Stress Relief Tips: ఒత్తిడితో సతమతమవుతున్నారా.. ఈ ఆసనం వేస్తే సెట్!
Stress Relief Tips
Chinni Enni
|

Updated on: Feb 22, 2024 | 12:41 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌కు చేరువై.. చివరకు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంది. ఇంట్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంటుంది. చివరకు మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీని వల్ల డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒత్తిడికి ముందుగానే చెక్ పెడితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడి ఎక్కువైతే పలు మానసిక సమస్యలు కూడా వస్తాయి.

అయితే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆసనం వేస్తే సరిపోతుంది. ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే మటుమాయం అవుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలను తగ్గించుకునేందుకు సమకోణాసనం బాగా పని చేస్తుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. మరి ఆ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.

సమకోణాసనం ఎలా వేయాలంటే..

ముందుగా నేలపై నిలబడి కాళ్లను దగ్గరగా ఉంచాలి. ఆ తర్వాత ముందుకు వంగాలి. ఇలా వంగినప్పుడు.. మీ బాడీ ఎల్ ఆకారంలో ఉండాలి. ఇప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచి.. తర్వాత రెండు చేతులను ముందుకు చాపి వాటి మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖాన్ని కిందకు ఉంచి నేలను చూడాలి. ఇలా ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని రోజూ కీనసం 10 నిమిషాలు అయినా చేయాలి.

ఇవి కూడా చదవండి

సమకోణాసనం ప్రయోజనాలు:

ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమి నుంచి కూడా బయట పడొచ్చు. కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. మీ వెన్నుముక దృఢంగా మారుతుంది. డెస్క్ జాబ్ చేసేవారికి ఈ ఆసనం బెస్ట్ అని చెప్పవచ్చు. వీని వల్ల చాలా రిలీఫ్ పొందుతారు. మెడ నొప్పి కూడా తగ్గుతుంది. అయితే మోకాళ్ల నొప్పులు, గర్భిణీలు, బాలింతలు, కాళ్లలో సమస్యలు ఉన్నవారు ఆ ఆసనాన్ని వేయకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.