AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు రాలడం ఆగిపోవాలా? ఈ ఒక్క చిట్కా చాలు.. దెబ్బకు ఒత్తుగా బలంగా పెరుగుతుంది..

జుట్టు రాలడం, చుండ్రు, చిన్న వయసులోనే జుట్టు పలుచబడటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, చుండ్రు, జుట్టు సంరక్షణలో పొరపాట్లు వంటి కారణాలు ప్రభావం చూపవచ్చు. ఆహారంలో పోషకాలు చేర్చుకోవడంతో పాటు జుట్టు సంరక్షణపై శ్రద్ధ పెట్టడం ద్వారా సమస్యను నియంత్రించేందుకు ప్రయత్నించవచ్చు.

జుట్టు రాలడం ఆగిపోవాలా? ఈ ఒక్క చిట్కా చాలు.. దెబ్బకు ఒత్తుగా బలంగా పెరుగుతుంది..
Hair Fall Control Tips
Shaik Madar Saheb
|

Updated on: Sep 24, 2026 | 12:28 PM

Share

ఆడవారికి, మగవారికి.. ఇద్దరికీ జుట్టు సౌందర్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలడం, చిన్న వయసులోనే బట్టతల రావడం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం, తగిన చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకుని, ఆరోగ్యకరమైన కేశాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు:

ఆహారపు అలవాట్లు – పోషక లోపం: జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, అదే విధంగా జుట్టు ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్, ముఖ్యంగా ఐరన్ లోపం జుట్టు రాలడానికి ఒక ముఖ్య కారణం.

రసాయన ఉత్పత్తుల వాడకం: రకరకాల కెమికల్ షాంపూలు, సబ్బులు వాడటం జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. ప్రతిరోజు తలస్నానం చేయడానికి రసాయన ఉత్పత్తులను వాడటం వల్ల స్కాల్ప్ సహజ నూనెలను కోల్పోయి, జుట్టు రాలడం పెరుగుతుంది.

శరీరంలో వేడి: కారంగా, పుల్లగా ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ప్రేగులలో వేడి పుడుతుంది. ఈ వేడి క్రానిక్‌గా మారినప్పుడు అది మెదడుకు చేరుకుని, స్కాల్ప్ లో వేడిని పెంచుతుంది. అధిక వేడి జుట్టు రాలడానికి దారితీస్తుంది.

నూనె రాయకపోవడం: పూర్వం పిల్లలకు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఆముదం రాసేవారు. ఇది స్కాల్ప్‌ను చల్లబరచి, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరం నుంచి వేడిని తగ్గించి, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం బేబీ ఆయిల్స్, ఇతర కెమికల్ ఉత్పత్తులతో ఈ సంప్రదాయ పద్ధతులను విస్మరించడం వల్ల జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి.

కాలుష్యం – చుండ్రు: వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల చుండ్రు సమస్య అధికమైంది. చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది జుట్టు మూలాల్లోకి చేరి, బాక్టీరియా వృద్ధికి కారణమై, మూలాలను దెబ్బతీసి జుట్టు రాలడానికి, చివరికి బట్టతలకు దారితీస్తుంది.

జుట్టు రాలడం నివారణకు – జుట్టు పెరుగుదలకు చిట్కాలు:

ఆముదం – కొబ్బరినూనె మిశ్రమం: 500 ml ఆముదం, 500 ml కొబ్బరినూనెను కలిపి, అందులో 20 నల్ల జీడి గింజలను (అడవి జీడి పిక్కలు) జాగ్రత్తగా కట్ చేసి వేసి మరిగించాలి. గింజలు పైకి తేలే వరకు మరిగించి, చల్లారాక వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను వాడటం వల్ల చుండ్రు తగ్గి, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు నశించి, హెయిర్ ఫాల్ ఆగి, జుట్టు పెరుగుదల ప్రారంభమవుతుంది. (గమనిక: నల్ల జీడి కట్ చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించాలి. లేదంటే పుళ్ళు పడతాయి.)

ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం: ఉసిరి, కరివేపాకు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ఐరన్‌కు మంచి వనరులు. ఉసిరి పౌడర్ లేదా పప్పును ఉపయోగించవచ్చు. ఉసిరి పై తొక్కను (వలపు) కచ్చాపచ్చాగా దంచి కషాయం కాచి, వారానికి కనీసం నాలుగు రోజులు దీనితో తలస్నానం చేయాలి. దీని వల్ల ఐరన్ జుట్టుకు అంది, హెయిర్ ఫాల్ తగ్గి, వెంట్రుకలు అందంగా, షైనింగ్‌గా తయారవుతాయి.

మూలికా కషాయం నూనె: గుంటగలగరాకు (భృంగరాజ్), గురివిందాకు, మర్రి చెట్టు లేత ఊడలను సేకరించాలి. ఈ మూడింటిని విడివిడిగా కషాయాలుగా కాసుకోవాలి (నాలుగు భాగాలు నీరు పోసి ఒక భాగం అయ్యే వరకు). ఈ మూడు కషాయాలను కలిపి, అదే మొత్తంలో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను కలపాలి. కషాయాలు పూర్తిగా ఆవిరైపోయి, నూనె మాత్రమే మిగిలే వరకు చిన్న మంటపై మరిగించాలి. ఈ నూనెను ప్రతిరోజు రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.

నిమ్మరసం-కొబ్బరినూనె: ఒక లీటరు కొబ్బరినూనెలో 200 ml నిమ్మరసం కలిపి, నిమ్మరసం విరిగిపోయే వరకు మరిగించాలి. ఈ నూనెను రాయడం వల్ల విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. కొబ్బరినూనె చలవదనం వల్ల స్కాల్ప్‌కు అవసరమైన పోషకాలు అంది, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

ముఖ్యమైన సూచనలు:

రసాయన షాంపూలను రోజూ వాడటం మానేయాలి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి.

రాత్రి నూనె రాసుకుని ఉదయం తలస్నానం చేయడం మంచిది.

ఆహారంలో జంక్ ఫుడ్ తగ్గించి, పౌష్టికాహారం తీసుకోవాలి.

ఈ సహజ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ, సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని నియంత్రించి, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.. అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ముందుగా వైద్యనిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us