AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే.. శాశ్వత పరిష్కారం తెలుసుకోండి!

ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు అందరి కోరిక. కానీ, జుట్టు చివర్లు చిట్లిపోవడం, జుట్టు రాలిపోవడం వల్ల జుట్టు అందం దెబ్బతింటుంది. కేవలం కత్తెరతో చిట్లిన చివర్లను కత్తిరించడం వల్ల ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోదు. ఈ సమస్యను నివారించడానికి పోషకాహారంతో పాటు ఇంట్లోనే సహజమైన హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం ద్వారా తేమ లాక్ అయి, దెబ్బతిన్న క్యూటికల్స్ రిపేర్ అవుతాయి.

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే.. శాశ్వత పరిష్కారం తెలుసుకోండి!
Split Ends
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2026 | 3:09 PM

Share

ఒకరి అందాన్ని పెంచడంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నల్లని, ఒత్తైన, పొడవాటి జుట్టును ఎవరు మాత్రం కోరుకోరు? కానీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య జుట్టు చివర్లు చిట్లిపోవడం, హెయిర్ ఫాల్. ఈ సమస్య కారణంగా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. చాలామంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి నెలా జుట్టు చివర్లను కత్తిరిస్తూ ఉంటారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. సమస్యను మూలాల నుండి తొలగించదు. మరి అసలు ఈ సమస్యకు అసలు కారణం ఏమిటి? ఇది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? తెలుసుకుందాం.

ఏ విటమిన్ లోపం వల్ల జుట్టు చిట్లిపోతుంది?

జుట్టు బలహీనపడి విరిగిపోవడానికి, చివర్లు చిట్లిపోవడానికి ప్రధాన కారణం పోషకాల లోపమే. ముఖ్యంగా బయోటిన్ (విటమిన్‌- బి7), విటమిన్ ఎ, విటమిన్ ఇ, అలాగే ఐరన్, జింక్ లోపం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. కాబట్టి ఈ సమస్యను దూరం చేయడానికి కేవలం బాహ్య సంరక్షణే కాకుండా, మీ ఆహారంలో పౌష్టికాహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం.

రెండు ముఖాల జుట్టును నివారించడానికి సహజమైన హెయిర్ మాస్క్:

జుట్టు చివర్ల సమస్యను శాశ్వతంగా తొలగించడానికి ఇంట్లోనే ఒక అద్భుతమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టులో తేమను లాక్ చేసి, దెబ్బతిన్న క్యూటికల్స్‌ను రిపేర్ చేస్తుంది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు రెండు పెద్ద స్పూన్ల అలోవెరా జెల్, ఒక పెద్ద స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆవ నూనె, ఒక చిన్న స్పూన్ ఆముదం లేదా కాస్టర్ ఆయిల్, ఒక చిన్న స్పూన్ తేనె తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

తయారీ, ఉపయోగించే విధానం:

ఒక శుభ్రమైన గిన్నెలో అలోవెరా జెల్, నూనెలు, తేనెను బాగా కలపాలి. ఇది ఒక క్రీమీ పేస్ట్ లా తయారవుతుంది. ఇప్పుడు మీ జుట్టును రెండు భాగాలుగా విభజించి, చివర్లపై కొద్దిగా నీటిని స్ప్రే చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పొడవునా, ముఖ్యంగా చివర్లకు బాగా పట్టించాలి. ఒక టవల్‌ను గోరువెచ్చని నీటిలో ముంచి, పిండి ఆ టవల్‌ను జుట్టు చుట్టూ 15 నుండి 20 నిమిషాల పాటు చుట్టాలి. ఇలా చేయడం వల్ల క్యూటికల్స్ తెరుచుకుని పోషకాలు లోపలికి వెళ్తాయి. 30 నుండి 45 నిమిషాల తర్వాత మైల్డ్ లేదా సల్ఫేట్-ఫ్రీ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, కేవలం 15 రోజుల్లోనే మీ జుట్టు చిట్లే సమస్య పూర్తిగా తగ్గిపోయి, జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..