AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందం చూసి మోసపోవద్దు.. నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

నెమలిని అందరూ అందమైన పక్షిలాగానే చూస్తారు. కానీ దాని అందం, శాంతమైన స్వభావం వెన ఓ భయంకరమైన వేటగాలు కూడా దాగి ఉన్నాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు. నెమలిని కేవలం అందమైన పక్షిగా చూడడం మన భ్రమ మాత్రమే. ఈ అందమైన పక్షి వెనుక ఎన్నో భయంకరమైన, ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 11, 2026 | 2:49 PM

Share
నెమలి కేవలం ధాన్యపు గింజలు మాత్రమే తిని జీవనం కొనసాగిస్తోంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలను సైతం బతికుండగానే వేటాడి మింగేయగలదు. అందుకే సంస్కృతంలో నెమలిని మయూర అంటే పాముల సంహారి అని పిలుస్తారు. ఎంత విషపూరితమైన తాచుపామైనా పడగ విప్పి నిలబడితే, నెమలి వేగంగా దూకి కాళ్లతో బలంగా తొక్కి పట్టి వేటాడుతుంది.

1 / 5
అందుకే పాముల ప్రపంచంలో నెమలిని ఓ తిరుగులేని వేటగాడుగా పిలుస్తారు. అయితే ఈ నెమలి కడుపులో ఉండే శక్తివంతమైన ఆమ్లం ఎంతటి ప్రమాదకరమైన తాచుపాము విషాన్ని అయినా సరే నీళ్లలా కరిగించేస్తుంది. ఇదే ఈ నెమలికి ప్రకృతి ఇచ్చిన ప్రత్యేక లక్షణం. కాబట్టి పాములైన వీటిని ఏం చేయాలేవు.

2 / 5
అంతేకాదు నెమలి ఈకల నీలం, ఆకుపచ్చ రంగుల వెనుక సైన్స్ చెప్పే షాకింగ్ నిజం ఏమిటంటే.. వాటిలో ఎలాంటి నీలం లేదా ఆకుపచ్చ పిగ్మెంట్ ఉండదు. నెమలి ఈకను పొడి చేసినా కేవలం బూడిద, గోధుమ రంగు దుమ్ము మాత్రమే కనిపిస్తుంది. మరి ఆ రంగులు ఎలా కనిపిస్తాయంటే.. ఇది ప్రకృతి సృష్టించిన స్ట్రక్చరల్ కలరేషన్ అనే క్వాంటం ఫిజిక్స్ చెబుతోంది.

3 / 5
నెమలి ఈకలపై వెంట్రుకంత సన్నని వేలాది మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఉంటాయి. సూర్యకాంతి వీటిపై పడినప్పుడు ప్రిజంలా కాంతిని వంచి మన కంటికి రంగుల భ్రమను కలిగిస్తాయి. కాంతి కోణం మారే కొద్దీ దీని రంగు కూడా మారుతుంది. అందుకే నెమలిని నిజమైన ‘బయోలాజికల్ హోలోగ్రామ్’ అంటారు.. అంటే నిజానికి అక్కడ లేని రంగును మనం చూస్తున్నామన్నమాట

4 / 5
నెమలి నాట్యం చేసేటప్పుడు ఈకలను వేగంగా ఆడిస్తూ మనుషులకు వినబడని అతి తక్కువ ఫ్రీక్వెన్సీ గల ధ్వనులను విడుదల చేస్తాయి. అయితే నెమలి తలపై ఉండే పించం రాడార్ యాంటెన్నాలా పనిచేసి ఈ వైబ్రేషన్స్‌ను రిలీజ్ చేస్తుంది. ఆ సమయంలో దూరంగా ఉన్న ఆడ నెమలి వాటిని పసిగడుతుంది. రంగుల భ్రమను సృష్టిస్తూ, వినబడని శబ్దాలతో రహస్యంగా సంభాషించే నెమలి.. ప్రకృతి సృష్టించిన ఒక అడ్వాన్స్‌డ్ డ్రోన్ లాంటి అద్భుత మాస్టర్ పీస్ అనే చెప్పాలి.

5 / 5
Follow Us