AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఘోరం.. సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి!

కిషన్‌గంజ్‌లో డయల్ 112 కానిస్టేబుల్ సమీర్ కుమార్ తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే బ్యారక్స్‌లో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలు లేదా విధుల ఒత్తిడి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఘోరం.. సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి!
Constable Shoots Self
Balaraju Goud
|

Updated on: Oct 11, 2026 | 3:08 PM

Share

బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని కానిస్టేబుల్ బ్యారక్స్‌లో డయల్ 112 విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం (అక్టోబర్ 11) ఉదయం వేళ జరిగిన ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడిని భాగల్పూర్ జిల్లాకు చెందిన సమీర్ కుమార్‌గా గుర్తించారు. ఆయన కిషన్‌గంజ్ జిల్లాలో డయల్ 112 అత్యవసర సేవల విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని బ్యారక్స్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల శబ్దం వినిపించడంతో బ్యారక్స్‌లో ఉన్న తోటి పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహచరులు తీవ్రంగా గాయపడిన సమీర్‌ను చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పరీక్షించిన అనంతరం ఆయన మరణించినట్లు ప్రకటించారు.

కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే..!

కాల్పులు జరగడానికి కొద్దిసేపటి ముందు సమీర్ తన భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, ఆ సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? ఆ సమయంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రంగంలోకి ఫోరెన్సిక్ బృందం

W ఘటన గురించి తెలుసుకున్న కిషన్‌గంజ్ జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ సదర్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించింది. బ్యారక్స్ నుంచి కేసింగ్‌తో పాటు సమీర్‌కు చెందిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు కిషన్‌గంజ్‌కు చేరుకున్నారు.

కుటుంబ కలహాలా.. విధుల ఒత్తిడా?

సమీర్ మృతికి కుటుంబ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు దారితీసిన కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, విధుల ఒత్తిడి, సెలవులకు సంబంధించిన సమస్యలు సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ వివరాలు, చివరి సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక, పోస్టుమార్టం ఫలితాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోస ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..