AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: మీ పిల్లలు నిద్రకు దూరమవుతున్నారా.? హెచ్చరిస్తోన్న నిపుణులు..

స్మార్ట్‌ఫోన్‌లు, రకరకాల గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది పిల్లలు నిద్రకు దూరమవుతున్నారు. అర్థరాత్రి అయినా టీవలకు అతుక్కుపోతున్నారు. దీంతో ఒకప్పుడు కేవలం పెద్దలకే పరిమితమైన నిద్రలేమి ఇప్పుడు చిన్నారులను సైతం వెంటాడుతోంది. నిద్రలేమి సమస్యలు పెద్దల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లే చిన్నారులపై కూడా...

Lifestyle: మీ పిల్లలు నిద్రకు దూరమవుతున్నారా.? హెచ్చరిస్తోన్న నిపుణులు..
Kids
Narender Vaitla
|

Updated on: Mar 29, 2024 | 8:41 AM

Share

స్మార్ట్‌ఫోన్‌లు, రకరకాల గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది పిల్లలు నిద్రకు దూరమవుతున్నారు. అర్థరాత్రి అయినా టీవలకు అతుక్కుపోతున్నారు. దీంతో ఒకప్పుడు కేవలం పెద్దలకే పరిమితమైన నిద్రలేమి ఇప్పుడు చిన్నారులను సైతం వెంటాడుతోంది. నిద్రలేమి సమస్యలు పెద్దల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లే చిన్నారులపై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల మానసిక స్థితిపై నిద్రలేమి తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇంతకీ చిన్నారుల్లో నిద్రలేమి ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* చిన్నారుల్లో సరైన నిద్రలేకపోతే అది వారి చదువుపై ప్రభావం చూపుతుతందని చెబుతున్నారు. ఏకాగ్రత దెబ్బతినడం వల్ల చదువుపై మనసును పెట్టలేరు. ప్రతీరోజూ కనీసం 8 గంటల నిద్ర ఉంటేనే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. లేదంటే ప్రతికూల ప్రభావం ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

* ఇక చిన్నారుల్లో నిద్రలేమి జ్ఞాపకశక్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. చదివిన ప్రతీ విషయాన్ని మర్చిపోతారని చెబుతున్నారు.

* సరైన నిద్రలేకపోతే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో చిన్నారుల్లో చిన్న వాటికే కోపం తెచ్చుకోవడం, చిరాకుపడడం, అందరిపై అరవడం వంటి లక్షణాలు ఉంటాయి. నిద్రలేమి చిన్న పిల్లల మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

* కేవలం మానసిక ఆరోగ్యంపైనే కాకుండా నిద్రలేమి చిన్నారుల శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిపడ నిద్రలేక పోతే చిన్నారు ఎదుగుదల మందగిస్తుంది.

ఇవి పాటించండి..

చిన్నారులకు వీలైనంత వరకు గ్యాడ్జెట్లను దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందే స్మార్ట్ ఫోన్‌ల వాడకం వారి కంటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది నిద్రలేమి దారి తీస్తుంది. ఇక ఉదయం పూట కూడా టీవీలకు అతుక్కుపోనివ్వకుండా కాస్త శారీరక శ్రమ కలిగేలా చూడాలి. గ్రౌండ్‌లో ఆడడం వంటివి అలవాటు చేయాలి. వీటివల్ల చిన్నారులు అలసిపోయి రాత్రుళ్లు త్వరగా నిద్రపోతారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..