AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం నీటితో కడిగితే సరిపోదు.. పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి

ప్రస్తుతం పండ్లు, కూరగాయలపై పురుగుమందులు, ఇతర రసాయనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తినే ముందు సరిగా శుభ్రం చేయడం చాలా అవసరం. కేవలం నీటితో కడగడం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. వెనిగర్, బేకింగ్ సోడా లేదా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టి కడిగితే రసాయన అవశేషాలు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం పండ్లు, కూరగాయల శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ అవసరం..

కేవలం నీటితో కడిగితే సరిపోదు.. పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
Fruit Cleaning Tips
Srilakshmi C
|

Updated on: Jun 28, 2026 | 8:42 PM

Share

ప్రస్తుతం వ్యవసాయంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం విస్తృతంగా పెరిగింది. పండ్లు, కూరగాయలు పండించే దశ నుంచి మార్కెట్‌కు చేరే వరకు వాటిపై వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తుంటారు. దీంతో వాటిని తినే ముందు సరిగ్గా శుభ్రం చేయడం చాలా అవసరం. కేవలం నీటితో కడగడం వల్ల అన్ని రసాయన అవశేషాలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోవు. అందుకే కొన్ని సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా పండ్లు, కూరగాయలను మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు.

వెనిగర్‌తో శుభ్రపరచండి

పండ్లు, కూరగాయలపై ఉండే కొన్ని రకాల రసాయన అవశేషాలు, సూక్ష్మజీవులను తొలగించడంలో వెనిగర్ ఉపయోగపడుతుంది.

ఎలా చేయాలి?

  • ముందుగా పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి.
  • ఒక భాగం వెనిగర్‌కు 3 నుంచి 4 భాగాల నీటిని కలిపి ద్రావణం తయారు చేయాలి.
  • అందులో పండ్లు, కూరగాయలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • అనంతరం మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి.
  • బేకింగ్ సోడా ఉపయోగించండి

బేకింగ్ సోడా కూడా పండ్లు, కూరగాయలపై ఉండే కొన్ని పురుగుమందుల అవశేషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా శుభ్రం చేయాలంటే..

ఇవి కూడా చదవండి
  • 2 నుంచి 3 కప్పుల నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి.
  • ఆ నీటిలో పండ్లు, కూరగాయలను 15 నిమిషాలు నానబెట్టాలి.
  • తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టి నిల్వ చేయాలి.

ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు

ఇది ఇంట్లో సులభంగా పాటించగల పద్ధతి. కూరగాయలపై ఉండే దుమ్ము, క్రిములు, బ్యాక్టీరియాను తొలగించడంలో ఉపయోగపడుతుంది.

ఎలా చేయాలి?

  • గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలపాలి.
  • పండ్లు, కూరగాయలను 10 నుంచి 15 నిమిషాల పాటు అందులో నానబెట్టాలి.
  • అనంతరం శుభ్రమైన నీటితో కడగాలి.

ఎందుకు శుభ్రం చేయాలి?

పండ్లు, కూరగాయలపై మిగిలే రసాయన అవశేషాలు, బ్యాక్టీరియా, ధూళి కణాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీటిని తీసుకునే ముందు మరింత జాగ్రత్త వహించాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే

  • మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పండ్లు, కూరగాయలను శుభ్రం చేయండి.
  • కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
  • కోసే ముందు తప్పనిసరిగా మరోసారి కడగడం మంచిది.
  • ఆకుకూరలను విడివిడిగా కడిగి శుభ్రం చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం కోసం పండ్లు, కూరగాయలు ఎంత ముఖ్యమో, వాటిని సురక్షితంగా శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us