ఎవరైనా మనల్ని మాయ చేయాలని చూస్తే.. ‘మీ పప్పులు నా దగ్గర ఉడకవులే’ అంటాం కదా! ఆ సంగతలా ఉంచితే... కూరగాయలతో పోలిస్తే పప్పులు ఉడకటం కొంచెం కష్టమే
TV9 Telugu
కందిపప్పు మరీను. అయితే పప్పు త్వరగా ఉడకటానికి కొన్ని మెళకువలు ఉన్నాయి.. అవేంటో.. ఏమేం పాటించాలో ఇక్కడ చూడండి..
TV9 Telugu
ముందు పప్పును దోరగా వేయించండి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉడకటమే కాదు మంచి రుచీ పరిమళం వస్తాయి. కొంతసేపు నానబెడితే త్వరగా ఉడుకుతుంది
TV9 Telugu
సమయాన్నే కాదు, ఇంధనాన్నీ ఆదా చేసినట్లవుతుంది. కాస్త వంటసోడా వేస్తే వేగంగా ఉడుకుతుంది కొంత ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మెదపండి
TV9 Telugu
అప్పుడు పని త్వరగానూ అవుతుంది, పప్పు మెత్తగానూ ఉంటుంది. ఉప్పు ముందుగా వేస్తే ఉడకటం ఆలస్యమౌతుంది. కారంతో పాటు ఉప్పును కూడా చివర్లోనే వేయండి
TV9 Telugu
టొమాటో పప్పు చేసేట్లయితే వాటిని ముందే చేర్చకండి. పప్పును విడిగా ఉడికించి... తాలింపులో ఉల్లిపాయ వేగాక టొమాటో ముక్కలు వేయడం ఉత్తమం
TV9 Telugu
ఎక్కువ నీళ్లు పోస్తే ఉడకటం ఆలస్యమౌతుంది. కాబట్టి తగినన్ని నీళ్లే పోయండి. సెగ పెంచితే త్వరగా పనైపోతుంది అనుకోవటం సరికాదు. దానివల్ల పొంగిపోవటం తప్ప ఫలితం ఉండదు
TV9 Telugu
తక్కువ సెగలో ఉడికించటమే మంచిది. పప్పుచారు, ఆకుకూరపప్పులకు నూనె కంటే నెయ్యి తాలింపు భేషనిపిస్తుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర వల్ల అదనపు రుచి వస్తుంది