AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE 2nd T20: బిగ్ షాక్.. ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డక్!

ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఛేజింగ్‌లో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి ఓవర్‌లోనే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగా అవుట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వనందుకే ఇలా జరిగిందంటూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో వైరల్ చేస్తున్నారు.

IND vs IRE 2nd T20: బిగ్ షాక్.. ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డక్!
Samson, Abhishek Golden Duc
SN Pasha
|

Updated on: Jun 28, 2026 | 8:59 PM

Share

ఐర్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోసారి ఐర్లాండ్ మంచి ఫైటింగ్ టార్గెట్ ఇచ్చింది. ఇక ఛేజింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు ఇద్దరూ కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. అది కూడా తొలి ఓవర్‌లోనే వికెట్లు సమర్పించుకున్నారు.

ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్ సంజూ శాంసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. మూంద్రా బౌలింగ్‌లో మాట్ హోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కెప్టెన్ అయ్యర్ సైతం 10 బంతుల్లో 7 పరుగులు చేసి మూంద్రా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా టీమిండియా కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి తడబడుతోంది. అంతకుముందు ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కాగా, ఓపెనర్లు ఇద్దరు గోల్డెన్ డక్ అవ్వడంతో వీళ్లకి వైభవ్ సూర్యవంశీ ఉసురు తగిలిందని నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆడిస్తామని ఐర్లాండ్ వరకు తీసుకెళ్లి, ఒక మ్యాచ్ ఆడించకుండా పాపం పిల్లాడికి ఆశ పెట్టి నిరాశ చెందేలా చేశారని అందుకే ఇలా జరుగుతుందంటూ కొంతమంది నెటిజన్లు మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!