తమలపాకు ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Samatha

28 June 2026

తమలపాకులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఎక్కువగా శుభకార్యాల్లో ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా భోజనం తర్వాత కెల్లీగా తీసుకుంటారు.

తమలపాకులు

అయితే తమలపాకును తినడం వలన బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

తమలపాకుల్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తీసుకోవడం వలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

పోషకాలు

ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వలన సీజన్ సమయంలో వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.

దగ్గు జలుబు

ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

అంతే కాకుండా గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను తరిమి కొట్టి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

గ్యాస్, ఉబ్బరం

తమలపాకు తినడం వలన ఇది డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

డయాబెటీస్ కంట్రోల్

ముఖ్యంగా భోజనం తర్వాత వీటి ఆకులతో జ్యూస్ చేసి తాగడం వలన దగ్గు, జలుబు, మూత్ర సమస్యలు, కడుపు సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయంట.

అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి