Lizards: గోడల మీద ఉండే బల్లులను చూస్తే భయమేస్తుందా..? అయితే ఇలా చేస్తే వెంటనే పారిపోతాయి

Lizards: చాలా మందికి బల్లులంటే ఎంతో భయం. వాటిని చూస్తేనే భయంతో వణికిపోతారు. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి బల్లులను ఇంటి నుంచి ఎలా,,

Lizards: గోడల మీద ఉండే బల్లులను చూస్తే భయమేస్తుందా..? అయితే ఇలా చేస్తే వెంటనే పారిపోతాయి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 10, 2021 | 11:11 AM

Lizards: చాలా మందికి బల్లులంటే ఎంతో భయం. వాటిని చూస్తేనే భయంతో వణికిపోతారు. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి బల్లులను ఇంటి నుంచి ఎలా తరిమేయాలని భావిస్తుంటారు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. యాంటీ బ్యాక్టీరియా సోల్యుషన్‌తో ఇంటి లోపల గోడలు, ఫ్లోర్‌ను క్రమం తప్పకుండా క్లీన్‌ చేయాలి. కిటికీలు, మూలాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మంది ఇళ్లల్లో బల్లులు ఉండటం సహజం. అయితే ఈ బిల్లులను చూస్తే కొందరు భయంతో పారిపోతుంటారు. బల్లులు ఉన్న ప్రాంతానికి అస్సులు రారు. బల్లులను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు చేసినా.. మళ్లి వస్తుంటుంది. ఇంట్లో గోడలపై ఉండే చిన్న చిన్న పురుగుల కోసం తరచూగా వస్తుంటాయి. వాటిని బయటకు తరిమికొట్టాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మళ్లీ కనిపించవు.

కాఫీ, టొమాకో పౌడర్‌ని నీటితో కలిపి ముద్దలా చేయాలి. ఆ ముద్దలను గోడలపై అతికించాలి. నెమలి ఈకలను చూస్తే బిల్లులు భయపడిపోతాయి. వాటికి కూడా ఇంట్లో పెడితే బల్లులు దరి చేరవు. వెలుతురుకు బల్లులు ఆకర్షితమవుతాయి. అందుకే వీలయినప్పుడల్లా బల్పులను ఆర్పేస్తే బల్లులు పెద్దగా రావు. గుడ్డు పొట్టుతో కూడా బల్బులను తరిమేయవచ్చు. ఆహారం దొరకకుంటే బల్లులు వాటంతవే వెళ్లిపోతాయి. అందుకే క్రిములు కీటకాలు ఉండకుండా చూసుకోండి. అలాగే ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు. ఉల్లిరసాన్నిగోడలపై స్ప్రే చేస్తే బల్లులు వెళ్లిపోతాయి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసి కిటికీలు, మూలల్లో ఉంచినా సరిపోతుంది. నాఫ్తలీన్ గోళీల వాసనకు బల్లులు పారిపోతాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచితే ప్రయోజనం ఉంటుంది. ఇక బిర్యానీ ఆకులను మండించి ఆ పొగని ఇంటి మొత్తం వ్యాపించేలా చేయాలి. ఆ వాసనకు బల్లులు ఉండలేవు. ముఖ్యంగా ఇంటి గోడలపై క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఫర్నిచర్‌ను గోడలకు ఆనించి ఉంచకూడదు.

మీరు కంటినిండా నిద్రపోతున్నారా..! లేదంటే మీ శరీరం గుళ్లగా మారిపోతుంది.. సుఖమైన నిద్ర కోసం ఇలా చేయండి..

నా శరీరంలో అవి నాకు కూడా నచ్చవు’.. ట్రోల్స్ చేసేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా..

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!