Mayonnaise Effects: మయోనీస్ ఎక్కువగా తింటున్నారా.. అసలు నిజం తెలిస్తే అస్సలు తినరు!

మయోనీస్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు చాలా తక్కువే. ఫాస్ట్ ఫుడ్‌కి కాంబినేషన్‌గా దీన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది వరకు కేవలం చికెన్ తందూరీతో మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్‌తో ఇది తినడం కామన్‌ అయిపోయింది. స్నాక్స్‌తో పాటు టమాటా సాస్ లేదా మయోనీస్ ఉండం సర్వ సాధారణంగా మారింది. కొన్ని రెస్టారెంట్స్‌లలో అయితే మయోనీస్‌కి కూడా ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. సలాడ్స్‌లో కూడా ప్రస్తుతం మయోనీస్‌ని యాడ్ చేసుకుని తింటున్నారు. మయోనీస్ యాడ్ చేయడం వల్ల..

Mayonnaise Effects: మయోనీస్ ఎక్కువగా తింటున్నారా.. అసలు నిజం తెలిస్తే అస్సలు తినరు!
Mayonnaise

Updated on: Jan 23, 2024 | 3:21 PM

మయోనీస్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు చాలా తక్కువే. ఫాస్ట్ ఫుడ్‌కి కాంబినేషన్‌గా దీన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది వరకు కేవలం చికెన్ తందూరీతో మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్‌తో ఇది తినడం కామన్‌ అయిపోయింది. స్నాక్స్‌తో పాటు టమాటా సాస్ లేదా మయోనీస్ ఉండం సర్వ సాధారణంగా మారింది. కొన్ని రెస్టారెంట్స్‌లలో అయితే మయోనీస్‌కి కూడా ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. సలాడ్స్‌లో కూడా ప్రస్తుతం మయోనీస్‌ని యాడ్ చేసుకుని తింటున్నారు. మయోనీస్ యాడ్ చేయడం వల్ల తినే ఫుడ్ రుచే మారిపోతుంది. నోటికి ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది దీని వెంబడి పడుతున్నారు. కానీ దీన్ని తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్న విషయం మాత్రం తెలీదు. మయోనీస్ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కొవ్వులు ఎక్కువగా ఉంటాయి..

మయోనీస్‌లో కేలరీలు, కొవ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మయోనీస్‌ని ఆయిల్, గుడ్లు, సోడియం, ఘాటు ఎక్కువగా ఉండే మసాలాలతో తయారు చేస్తారు. కాబట్టి వీటిల్లో కేలరీలు, కొవ్వులు అనేవి అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఊబకాయం రావడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా రావొచ్చు.

గుండె సమస్యలు పెరుగుతాయి..

మయోనీస్ వంటి హై ఫ్యాట్ అండ్ హై కేలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ అనేది అధికంగా పెరుగుతుంది. దీన్ని సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లను కలిగి ఉండే కూరగాయల నూనెలతో తయారు చేస్తారు. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా తీసుకుంటే.. గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది..

మయోనీస్‌లో పచ్చి గుడ్లను ఉపయోగిస్తారు. ఇందులో ప్రమాదకరమైన సాల్మొనెల్లా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల వాంతులు, వికారంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటమే మంచిది.

గర్భిణిలు – పిల్లలు దూరంగా ఉండాలి..

మయోనీస్ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణిలు, పిల్లలు వీలైనంత వరకు మయోనీస్ తినకపోవడమే మంచిది. లేదంటే తరచూ అనారోగ్య సమస్యల పాలవుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.