Gaddi Chamanthi: ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

రోడ్లపై, చెరువుల పక్కన, కాలువల పక్కన.. ఇలా ఎక్కడపడితే అక్కడ పెరిగే మొక్కల్లో గడ్డి ఛామంతి ఒకటి. నల్లారంగా పిలుచుకునే ఈ ఆకుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా గడ్డి ఛామంతి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Gaddi Chamanthi: ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Gaddi Chamanthi
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2024 | 7:34 AM

ప్రకృతి మనకు సహజంగానే ఎన్నో అద్భుతమైన వరాలు అందించాయి. వాటిలో చాలా వాటి గురించి మనకు తెలిసి కూడా ఉండవు. రోడ్డు పక్కన వాటంతటవే పెరిగే చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిలో గడ్డి చామంతి ఒకటి. పొలాల గట్లపై, కాలువల పక్కన పెరిగే ఈ మొక్కలు సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఫ్రీగా దొరికే ఈ మొక్కలు ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి.

చిన్నప్పుడు గడ్డి ఛామంతి ఆకులను పలకను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే వాళ్లం. దీనిని కొన్ని ప్రాంతాల్లో నల్లారం అని పిలుస్తుంటారు. ఈ ఆకులను ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్‌ ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నమిలి తినడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.

ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ప్టమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు , గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గాయాలను తగ్గించడంలో కూడా ఈ ఆకులు ఉపయోగడపతాయి. ఏదైనా గాయం జరిగితే ఈ ఆకుల రసాన్ని పిండుకోవాలి. త్వరగా గాయం మానుతుంది. గాయం తగిలిన చోట ఆకుల రసాన్ని రాస్తే రక్తం త్వరగా గడ్డకడుతుంది.

ఇక జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గడ్డి చామంతి ఆకులు ఉపయోగపడతాయి. ఆకులను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్టును ఆవనూనెలో కలిపి నూనెను మరిగించాలి. అనంతరం ఈ నూనెను వడకట్టి ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు సమస్య ఇట్టే తగ్గిపోతుంది. శ్వాస సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. ఆకులను కషాయం రూపంలో చేసుకొని తాగితే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..