గుండె జబ్బులకు చెక్ చెప్పే ‘ సెల్స్ ‘.. న్యూ ఇన్వెన్షన్

గుండె జబ్బులను నివారించే ప్రత్యేక ఇమ్యూన్ సెల్స్ (కణజాలాన్ని) పరిశోధకులు కనుగొన్నారు. ‘ పెరికార్డియల్ మేక్రోఫేజెస్ ‘ అని వ్యవహరించే ఈ కణజాలం గుండె చుట్టూ ఉండే ప్రదేశంలో ఉంటుందని కెనడాలోని కేల్గరీ యూనివర్సిటీ రీసెర్చర్లు అంటున్నారు. లిక్విడ్ తో కూడిన వీటిని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని కూడా అంటారట. డయాగ్నస్టిక్ సెంటర్లలో దీన్ని టెస్ట్ చేసినప్పటికీ.. దీని పనితీరుపై ఇప్పటివరకు డాక్టర్లకు పెద్దగా అవగాహన లేదని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మిస్టీరియస్ ఫ్లూయిడ్ లో […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 12:48 pm, Wed, 17 July 19
గుండె జబ్బులకు చెక్ చెప్పే ' సెల్స్ '.. న్యూ ఇన్వెన్షన్

గుండె జబ్బులను నివారించే ప్రత్యేక ఇమ్యూన్ సెల్స్ (కణజాలాన్ని) పరిశోధకులు కనుగొన్నారు. ‘ పెరికార్డియల్ మేక్రోఫేజెస్ ‘ అని వ్యవహరించే ఈ కణజాలం గుండె చుట్టూ ఉండే ప్రదేశంలో ఉంటుందని కెనడాలోని కేల్గరీ యూనివర్సిటీ రీసెర్చర్లు అంటున్నారు. లిక్విడ్ తో కూడిన వీటిని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని కూడా అంటారట. డయాగ్నస్టిక్ సెంటర్లలో దీన్ని టెస్ట్ చేసినప్పటికీ.. దీని పనితీరుపై ఇప్పటివరకు డాక్టర్లకు పెద్దగా అవగాహన లేదని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మిస్టీరియస్ ఫ్లూయిడ్ లో గుండె రుగ్మతలను నయం చేసే మేక్రోపేజెస్, ఇమ్యూన్ సెల్స్ ఉంటాయని, పైగా గుండె దగ్గరి కండరాలు, ధమనులను ‘ కాపాడుతాయని ‘ తమ రీసెర్చ్ లో తేలినట్టు వీరు తెలిపారు.

తాము కనుగొన్న ఈ కొత్త విషయాలు గుండె జబ్బు రోగులకు వరం కావచ్చునని, అలాగే కార్డియాలజిస్టులు కూడా దీనిపై దృష్టి సారించవచ్చునని ఆశిస్తున్నారు. నిజానికి మేక్రోఫెజెస్ అంటే ‘ బిగ్ ఈటర్స్ ‘ అట.. దీని అర్థం గుండెకు హాని చేసే కణాలను ఇవి నశింపజేస్తాయన్న మాట.. ఈ పెలికార్డియల్ ఫ్లూయిడ్ లో హీలింగ్ సెల్స్ ఉంటాయని, హార్ట్ మజిల్స్ ని శక్తిమంతం చేయగల సత్తా కూడా వీటికి ఉంటుందని కేల్గరీ యూనివర్సిటీ అధ్యాపకులు భావిస్తున్నారు. తమ పరిశోధనల తాలూకు వివరాలను వీరు కెనడాలోని మెడికల్ జర్నల్స్ లో ప్రచురించారు.