విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది.. వర్షాకాలం ప్రారంభం కావడంతో జనాన్ని భయపెడుతోంది. కాలాలతో సంబంధం లేకుండా వ్యాపించే స్వైన్‌ఫ్లూ ఈ సీజన్‌లో మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా అనేకమంది మంచాన పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులు హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు. గత ఆరు నెలల కాలంలో ఈ వ్యాధి కారణంగా 21 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటివరకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:21 pm, Tue, 16 July 19
విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది.. వర్షాకాలం ప్రారంభం కావడంతో జనాన్ని భయపెడుతోంది. కాలాలతో సంబంధం లేకుండా వ్యాపించే స్వైన్‌ఫ్లూ ఈ సీజన్‌లో మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా అనేకమంది మంచాన పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులు హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు. గత ఆరు నెలల కాలంలో ఈ వ్యాధి కారణంగా 21 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటివరకు 50 వరకు కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.

స్వైన్‌ఫ్లూ అంటువ్యాధి కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయాల్లో మాస్క్ ధరించాలని, సూచిస్తున్నారు. అలాగే విపరీతమైన జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు డాక్టర్లు.